12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కారణంగా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన భారత క్రికెటర్‌

Richa Ghosh, IND vs NZ, Cricket News: 12వ తరగతి పరీక్షలు ఉన్నాయని.. ఓ స్టార్‌ క్రికెటర్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరం అవుతున్నారు. మరి క్రికెటర్ ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Richa Ghosh, IND vs NZ, Cricket News: 12వ తరగతి పరీక్షలు ఉన్నాయని.. ఓ స్టార్‌ క్రికెటర్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరం అవుతున్నారు. మరి క్రికెటర్ ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో చోటు దక్కించుకుంటే చాలు.. ఇక లైఫ్‌లో సెట్‌ అయిపోయినట్టే అని చాలా మంది భావిస్తారు. ఇండియన్‌ జెర్సీ వేసుకొని.. దేశం తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం వస్తే.. తమని తాము నిరూపించుకుంటామని ఎంతో మంది యువత కలలుకంటూ ఉంటారు. అది మెన్స్‌ క్రికెట్‌లో అయినా, ఉమెన్స్‌ క్రికెట్‌లో అయినా ఒకటే. దేశానికి ఆడాలనే లక్ష్యంతో పాటు, ఆర్థికంగానే బాగా స్థిరపడే అవకాశం ఉంటుంది ఇండియాకు ఆడితే. కానీ, కొంతమంది క్రికెటర్లు మాత్రం.. ఇండియాకు ఆడుతూ స్టార్‌ ప్లేయర్లుగా ఎదిగిన తర్వాత కూడా.. చదువును నిర్లక్ష్యం చేయరు. అవసరం అయితే.. చదువు కోసం కొన్ని మ్యాచ్‌లకు కూడా దూరం అవుతారు. అలాంటి క్రికెటరే రిచా ఘోష్‌. ఇండియన్ ఉమెన్స్‌ టీమ్‌లో వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రిచా. ఇక విధంగా చెప్పాలంటే.. ఆమెను క్రికెట్‌ అభిమానులు లేడీ ధోని అని కూడా పిలుస్తుంటారు.

అలాంటి క్రికెటర్‌.. ఇప్పుడు 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కోసం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. 21 ఏళ్ల రిచా.. 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నారు. సరిగ్గా పరీక్షల టైమ్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ కూడా ఉంది. అయితే.. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కోసం, ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. రిచా నిర్ణయాన్ని గౌరవిస్తూ.. బీసీసీఐ కూడా ఆమెకు అనుమతి ఇస్తూ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు రిచాను ఎంపిక చేయలేదు. రిచాతో పాటు మరో ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు కూడా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడటం లేదు. మోకాలి గాయం కారణంగా స్పిన్నర్ ఆశా శోభన దూరం కాగా, పేసర్ పూజా వస్త్రాకర్‌కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు లేకపోవడంతో 16 మంది సభ్యులతో కూడిన స్క్వౌడ్‌లో నలుగురు కొత్త ప్లేయర్లు తీసుకున్నారు సెలెక్టర్లు. సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్లు సయాలీ సత్‌ఘరే, సైమా ఠాకోర్, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్‌లు భారత తొలి కాల్ అప్‌లను అందుకున్నారు.

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 24, 27, 29న మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్ వర్సెస్ వన్డే సిరీస్ కోసం భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, డి హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్), ఉమా చెత్రీ (వికె), సయాలీ సత్గారే, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, తేజల్ హసబ్నిస్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ ఉన్నారు. మరి 12వ తరగతి పరీక్షల కోసం సిరీస్‌ను మిస్‌ అవుతున్న రిచాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments