MS Dhoni: ధోని పరువు తీసేలా RCB ఫ్యాన్స్ ట్వీట్స్! ఇంతలా తిడుతున్నారేంటి?

MS Dhoni: ధోని పరువు తీసేలా RCB ఫ్యాన్స్ ట్వీట్స్! ఇంతలా తిడుతున్నారేంటి?

తాజాగా ట్విట్టర్ లో 'RCB FINISHED DHOBI' అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఈ పదం ట్రెండింగ్ లోకి రావడానికి కారణం ఏంటంటే?

తాజాగా ట్విట్టర్ లో 'RCB FINISHED DHOBI' అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఈ పదం ట్రెండింగ్ లోకి రావడానికి కారణం ఏంటంటే?

ఐపీఎల్ 2024లో ఫైనల్ మ్యాచ్ కంటే ఎక్కువగా ఉత్కంఠతను రేపిన మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్సీబీ. ఈ సీజన్ మెుత్తానికి ఈ పోరు హైలెట్. ఫైనల్ పోరు కంటే ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ డూ ఆర్ డై పోరులో చెన్నైను ఓడించి.. ప్లే ఆఫ్స్ కు చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు. అయితే ఈ మ్యాచ్ తోనే మహేంద్రసింగ్ ధోని కథను ఆర్సీబీ ముగించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ లో ‘RCB FINISHED DHOBI’ అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఈ పదం ట్రెండింగ్ లోకి రావడానికి కారణం ఏంటంటే?

మహేంద్రసింగ్ ధోని.. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత తన కెరీర్ కు వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు. అదీకాక ఈసారి చెన్నైకి ఆరవ ఐపీఎల్ టైటిల్ ను అందించి తన కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలుకుదామని ధోని అనుకున్నాడని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. కానీ ప్లే ఆఫ్స్ కు చేరకుండానే సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో ధోని కన్న కలలు ఆవిరైయ్యాయి. చెన్నైని ఓడించిన ఆర్సీబీ ఈ మ్యాచ్ ద్వారా ధోని కథను ముగించిందని ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ట్విట్టర్ లో ‘RCB FINISHED DHOBI’ అనే పదాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పదం ట్విట్టర్ లో మారుమోగిపోతోంది.

అయితే ధోని ఫ్యాన్స్ వీరికి తగ్గట్లుగానే కౌంటర్ ఇస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ అయిన ధోని కెరీర్ ను ఓ జట్టు ఎలా ముగిస్తుంది? అసలు అది సాధ్యం అయ్యే విషయమేనా.. మీరు ఏ తీరుగా ఆలోచిస్తున్నారు? అంటూ వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. ధోని తన తొడ కండరాల గాయానికి చికిత్స కోసం లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాత 5 నుంచి 6 నెలల విశ్రాంతి తీసుకోనున్నట్లు సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి. ఆర్సీబీ ధోని కెరీర్ ముగించింది అన్న వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments