RCB అభిమానులకు గుడ్‌ న్యూస్‌! ప్లే ఆఫ్‌ ఛాన్సులు ఇంకా ఉన్నాయి!

RCB, IPL 2024, Playoffs: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయినా కూడా ఆ జట్టుకు ‍ప్లే ఆఫ్‌ అవకాశాలు ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

RCB, IPL 2024, Playoffs: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయినా కూడా ఆ జట్టుకు ‍ప్లే ఆఫ్‌ అవకాశాలు ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించి.. 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఆర్సీబీకి ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ ఆరుకు ఆరు మ్యాచ్‌లు గెలిచినా.. ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కి వెళ్లడం కష్టం అంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఆదివారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఆర్సీబీ అధికారికంగా ఈ సీజన్‌ నుంచి ఎలిమినేట్‌ అయిపోయిందని, ఇక ప్లే ఆఫ్స్‌కు వెళ్లదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇంకా ఆర్సీబీకి ప్లే ఆఫ్‌ అవకాశాలు ఉ‍న్నాయి. ఇప్పటి వరకు ఆర్సీబీ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. ఒక విజయంతో ఆర్సీబీ ఖాతాలో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. సో.. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. మరో 12 పాయింట్లు వచ్చి చేరుతాయి.

అయితే.. ఒక టీమ్‌ ఎలాంటి అడ్డకులు, ఇతర టీమ్స్‌తో సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. కచ్చితంగా 16 పాయింట్లు సాధించాలి. అయితే.. ఆర్సీబీ మిగిలిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. మొత్తం 14 పాయింట్లు ఆర్సీబీ ఖాతాలో ఉంటాయి. అయినా కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లదు. కానీ, ఇతరు టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడొచ్చు. ఆర్సీబీకి మేలు చేస్తూ.. కొన్ని టీమ్స్‌ గెలుస్తూ, మరికొన్ని టీమ్స్‌ ఓడిపోతూ ఉండాలి. కొన్ని మ్యాచ్‌లు రద్దు అయితే.. ఆర్సీబీకి ఇంకా ప్లస్‌ అవుతుంది. అయితే.. ఏ మ్యాచ్‌ ఎవరు గెలవాలి, ఏ మ్యాచ్‌లో ఏ టీమ్‌ ఓడిపోవాలి, ఏ మ్యాచ్‌ రద్దు కావాలి.. ఇలాంటి విషయాలన్ని లెక్కలేస్తే బుర్ర కరాబ్‌ అవుతుంది కానీ, ఇప్పటికీ ఆర్సీబీకి ప్లే ఆఫ్‌ అవకాశాలు అయితే పూర్తిగా మూసుకోపోలేదు. ఇంకా సజీవంగానే ఉన్నాయి. కానీ, చాలా అంటే చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అయితే అసాధ్యం అయితే కాదు.

ఇతర టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడే ముందు.. ఆర్సీబీ మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించాలి. ఇదే ఆ జట్టుకు పెద్ద సమస్య.. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే చందానా.. ఆర్సీబీ ఇతర టీమ్స్‌పై ఆధారపడాల్సి వచ్చినా.. ముందు తమ చేతుల్లో ఉన్న పనిని వంద శాతం పూర్తి చేయాలి. ప్రస్తుతం ఆర్సీబీ టీమ్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. ఆరుకు ఆరు మ్యాచ్‌లు గెలవడం కష్టమే అనిపిస్తోంది. అయినా కూడా ఆశ పట్టుకోవడంలో తప్పులేదు. పైగా ఆర్సీబీ టీమ్‌ను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. 2016 సీజన్‌లో తొలి 7 మ్యాచ్‌లలో ఒక్క విజయం మాత్రమే సాధించిన ఆ జట్టు.. తర్వాత వరుస విజయాలతో ఏకంగా ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. అలాంటి ఘటన మళ్లీ పునారవృత్తం అవుతుందేమో చూడాలి. మరి ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments