Nidhan
Ravichandran Ashwin, IND vs BAN: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.
Ravichandran Ashwin, IND vs BAN: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.
Nidhan
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటే చాలా మంది స్పిన్నరే అనుకుంటారు. కానీ బాల్‌ను గింగిరాలు తిప్పుతూనే.. సమయం వచ్చినప్పుడు బ్యాట్‌తోనూ అతడు మ్యాజిక్ చేస్తాడు. బ్యాట్‌ను మంత్రదండంలా తిప్పుతూ పరుగుల వరద పారిస్తాడు. జట్టు కష్టాల్లో పడిన చాలా సార్లు ఆదుకున్నాడు. అతడు తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అశ్విన్ క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. టీమ్ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన దిగ్గజ స్పిన్నర్.. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్కోరు బోర్డు మీదకు ఒక్కో రన్ చేరుస్తూ పోయాడు. బంగ్లా బౌలర్లను అతడు చిదకబాదాడు. దీంతో అశ్విన్ తండ్రి సంతోషం పట్టలేకపోయాడు.
అశ్విన్ బ్యాటింగ్ చూస్తూ అతడి తండ్రి ఎంజాయ్ చేశాడు. చప్పట్లు కొడుతూ, నవ్వుతూ కనిపించాడు. క్రికెట్లో అశ్విన్ ఎంతో సాధించాడు. అయితే సొంత గ్రౌండ్లో టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో అతడి తండ్రి సంతోషంలో మునిగిపోయాడు. ఆయనే కాదు.. గ్రౌండ్లో ఉన్న ఆడియెన్స్ కూడా లోకల్ బాయ్ క్లాస్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నారు. అశ్విన్.. అశ్విన్ అంటూ అరుస్తూ ఎంకరేజ్ చేశారు. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి స్టార్ట్ దొరకలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (6), టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. శుబ్‌మన్ గిల్ (0) డకౌట్ అయ్యాడు. యంగ్ పేసర్ హసన్ మహమూద్ ఈ ముగ్గుర్నీ ఔట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 56) తన పని తాను చేసుకుంటూ పోయాడు. రిషబ్ పంత్ (52 బంతుల్లో 39)తో కలసి టీమ్‌ను ఆదుకున్నాడు. అయితే ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. 144కు 6 వికెట్లు నష్టపోయింది టీమిండియా. ఈ టైమ్‌లో క్రీజులోకి వచ్చాడు అశ్విన్.
జడేజా (86 బంతుల్లో 60 నాటౌట్)తో కలసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు అశ్విన్ (90 బంతుల్లో 81 నాటౌట్). ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కూల్‌గా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్ల కంటే సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయడం మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. మధ్య మధ్యలో ఫోర్లు బాదాడు. 9 బౌండరీలు కొట్టిన అశ్విన్.. ఓ భారీ సిక్స్ బాదాడు. అశ్విన్-జడ్డూ దెబ్బకు బంగ్లా బౌలర్లకు మైండ్‌బ్లాంక్ అయింది. మంచి షాట్స్ కొడుతూ ఈజీగా స్ట్రైక్ రొటేట్ చేస్తుండటంతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇద్దరూ క్రీజులో సెటిల్ అవడంతో వాళ్లను ఎలా ఆపాలా అని తలబాదుకుంటున్నారు. ముఖ్యంగా అశ్విన్ టాపార్డర్ బ్యాటర్ మాదిరిగా క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతుండటంతో వాళ్లు బిత్తరపోయారు. భారత్ ప్రస్తుతం 6 వికెట్లకు 303 పరుగులతో ఉంది. అశ్విన్-జడేజా ఇలాగే ఆడితే ఈజీగా 450 మార్క్‌ను టచ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
Ravichandran Ashwin’s father enjoying his son’s fabulous performance with the bat at Chepauk 🤩❤️#RavichandranAshwin #INDvBAN #Tests #Sportskeeda pic.twitter.com/K3oncsIJlT
— Sportskeeda (@Sportskeeda) September 19, 2024