ద్రవిడ్ టార్చర్ చేసేవాడు.. మాజీ కోచ్​పై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Ravichandran Ashwin Opens Up on Rahul Dravid: టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిన కోచ్​ల్లో రాహుల్ ద్రవిడ్ ఒకడు. టీ20 వరల్డ్ కప్​ను భారత్ అందుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. జట్టును అద్భుతంగా నడిపించిన ద్రవిడ్.. మూడు ఫార్మాట్లలోనూ మెన్ ఇన్ బ్లూను టాప్​లో నిలిపాడు.

Ravichandran Ashwin Opens Up on Rahul Dravid: టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిన కోచ్​ల్లో రాహుల్ ద్రవిడ్ ఒకడు. టీ20 వరల్డ్ కప్​ను భారత్ అందుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. జట్టును అద్భుతంగా నడిపించిన ద్రవిడ్.. మూడు ఫార్మాట్లలోనూ మెన్ ఇన్ బ్లూను టాప్​లో నిలిపాడు.

టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిన కోచ్​ల్లో రాహుల్ ద్రవిడ్ ఒకడు. టీ20 వరల్డ్ కప్​-2024ను భారత్ అందుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. జట్టును అద్భుతంగా నడిపించిన ద్రవిడ్.. మూడు ఫార్మాట్లలోనూ మెన్ ఇన్ బ్లూను టాప్​లో నిలిపాడు. వన్డే వరల్డ్ కప్-2023 మిస్ అయినా.. ఈ ఏడాది దేశానికి పొట్టి కప్పును అందించి తన కోచింగ్ కెరీర్​ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్​తో టీమిండియా హెడ్ కోచ్​ పదవికి అతడు గుబ్​బై చెప్పేశాడు. జట్టుతో ఉన్న టైమ్​లో అందరు ఆటగాళ్లతో అతడు మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేశాడు. బ్యాటర్లు, బౌలర్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. వాళ్ల పెర్ఫార్మెన్స్​లే దీనికి బిగ్ ఎగ్జాంపుల్. అయితే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ద్రవిడ్​ తమను టార్చర్ చేశాడని అంటున్నాడు. అశ్విన్ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

ద్రవిడ్ ప్రతి విషయంలో పర్టిక్యులర్​గా ఉండేవాడని అశ్విన్ తెలిపాడు. అన్నీ సరిగ్గా ఉండాలని అతడు కోరుకునేవాడని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్​ విషయాల్లోనూ అతడు కచ్చితత్వంతో ఉండేవాడన్నాడు. ఒక చోట పెట్టిన బాటిల్.. తిరిగి అక్కడే పెట్టాలని లేకపోతే ఊరుకునేవాడు కాదన్నాడు. ప్రతి విషయం ఆర్డర్​లో ఉండాలి, తాను అనుకున్నవి అనుకున్నట్లు పద్ధతి ప్రకారం జరగాలని అనేవాడని.. ఆ రకంగా తమకు టార్చర్ చూపించాడని అన్నాడు అశ్విన్. అయితే కోచ్​గా తమకు అండగా నిలబడ్డాడని, తమకు ఎంతో సపోర్ట్​ చేశాడని మెచ్చుకున్నాడు. ద్రవిడ్​తో పోలిస్తే ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ కంప్లీట్​గా డిఫరెంట్ అన్నాడు. అతడికి ప్రతిదీ ఇలా ఉండాలి, అలా ఉండాలనే ఎక్స్​పెక్టేషన్స్ లేవన్నాడు. అతడు చాలా రిలాక్స్​డ్​గా ఉంటాడని పేర్కొన్నాడు అశ్విన్.

గంభీర్ ఎప్పడూ కూల్​గా, కామ్​గా ఉంటాడని అశ్విన్ తెలిపాడు. అతడ్ని అందరూ ఇష్టపడతారన్నాడు. అతడి వ్యక్తిత్వం అలాంటిదన్నాడు. జట్టులోని ప్రతి ప్లేయర్‌‌ గంభీర్​ను ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు అశ్విన్. డ్రెస్సింగ్ రూమ్​లో గౌతీ నవ్వుతూ రిలాక్స్​డ్​గా ఉంటాడని పేర్కొన్నాడు. అదే ద్రవిడ్ కాస్త సీరియస్​గా ఉండేవాడని.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని కోరుకునేవాడన్నాడు. గంభీర్ నుంచి అలాంటి ప్రెజర్ లేదన్నాడు అశ్విన్. అతడు కూల్​గా తన పని తాను చేసుకుంటూ, అందరితో ఈజీగా కలసిపోతాడన్నాడు. ఇక, బంగ్లాదేశ్​తో మొదటి టెస్ట్​లో అదరగొట్టిన అశ్విన్ సెకండ్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. స్పిన్​కు అంతగా అనుకూలించని చెన్నైలోనే 6 వికెట్లతో చెలరేగిన ఈ సీనియర్ బౌలర్.. టర్న్​ పుష్కలంగా దొరికే కాన్పూర్​లో బంగ్లా బెండు తీయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్​లో రెచ్చిపోతున్న అశ్విన్ అదే జోరును కనబరిస్తే మరిన్ని పాత రికార్డులకు పాతర వేయడం ఖాయం.

Show comments