Somesekhar
Ravichandran Ashwin Comments On Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంటే తనకు అసూయ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
Ravichandran Ashwin Comments On Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంటే తనకు అసూయ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
Somesekhar
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్ తో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో బంతితో చెలరేగాడు. 6 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఇక విజయానంతరం విలేకరులతో మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. రవీంద్ర జడేజా అంటే నాకు అసూయ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్ లో1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ విన్నింగ్ హీరో రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ అనంతరం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జడేజా అంటే నాకు అసూయ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అశ్విన్ మాట్లాడుతూ..”కొన్ని సమయాల్లో భవిష్యత్ ను తలచుకుంటే కష్టంగా అనిపిస్తుంది. నిజంగానే ఇది సుదీర్ఘ సీజన్. ఒక్కోసారి 3-4 నెలల్లోనే 10 టెస్టులు ఆడాల్సి ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఫ్యూచర్ గురించి ఆలోచించకపోవడమే మంచిదనిపిస్తుంది. ఇక ఆటల మధ్యలో రెస్ట్ తీసుకోవాలి. దీని వల్ల ఫిట్ గా ఉండొచ్చు. శారీరకంగా ఫిట్ గా ఉంటూ.. సీజన్ ను పూర్తి చేయడమే నాకు ముఖ్యం. అందుకే రెండు సిరీస్ ల మధ్య రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను” అంటూ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు.
ఇక కెరీర్ ఆరంభంలో ఆడటం వేరు.. 38 ఏళ్ల వయసులో ఆడటం వేరు అని చెప్తూనే.. ఇప్పుడు ఆడితే రెట్టింపు కృషి చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు అశ్విన్. ఈ సందర్భంగా రవీంద్ర జడేజా గురించి మాట్లాడుతూ..”జడేజా కెరీర్ ఎంతో ఆదర్శ, స్పూర్తిదాయకమైంది. అతడు బ్యాటింగ్ కు వెళ్తే.. నేను డ్రెస్సింగ్ రూమ్ లో ప్రశాంతంగా ఉండేవాడిని. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో జడ్డూ అద్బుతాలు చేయగలడు. అందుకే నాకు అతడంటే అసూయ. కానీ.. నేను జడేజాని ఆరాధిస్తాను. అతడితో నేను ఎప్పటికీ పోటీ పడలేను అని తెలిశాక.. జడేజాపై నాకు అభిమానం ఇంకాస్త ఎక్కువైంది. క్రికెట్ కు వచ్చే సరికి కొన్నిసార్లు మన సహచరుల కంటే మనమే ముందుండాలని అనుకుంటాం. అది సహజం. ఆ తర్వాత ఒకరిని ఒకరు మెచ్చుకుంటా. మా విషయంలో కూడా అదే జరిగింది” అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అశ్విన్. ఈ క్రమంలోనే టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ పై ప్రశంసలు కురిపించాడు ఈ వెటరన్ క్రికెటర్.