RCB కెప్టెన్‌గా యంగ్‌ ప్లేయర్‌ ఫిక్స్‌! ఎవరూ ఊహించి ఉండరు!

Rajat Patidar, RCB, IPL 2025, Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ ఎవ్వరూ ఊహించని ప్లేయర్‌కు ఇచ్చేందుకు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Rajat Patidar, RCB, IPL 2025, Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ ఎవ్వరూ ఊహించని ప్లేయర్‌కు ఇచ్చేందుకు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2025కి ఇంకా చాలా సమయం ఉన్నా.. ఐపీఎల్‌ టీమ్స్‌కి సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. రాబోయే సీజన్‌ కోసం మెగా వేలం జరిగనుండటంతో.. అన్ని ఫ్రాంచైజీలు స్ట్రాంగ్‌ టీమ్స్‌ను బిల్డ్‌ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాయి. అలాగే కొన్ని టీమ్స్‌ తమ కెప్టెన్లను కూడా మార్చుకునే పనిలో పడ్డాయి. ఐపీఎల్‌లో అత్యంత భారీ క్రేజ్‌ ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సైతం.. తమ కొత్త కెప్టెన్‌ను ఫైనల్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ను వచ్చే సీజన్‌ కోసం రిటేన్‌ చేసుకునేందుకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ ఆసక్తిగా లేదని, అందుకే కొత్త కెప్టెన్‌ను వేలం నుంచి కాకుండా.. ఆల్రెడీ జట్టులో కొంత కాలంగా కొనసాగుతూ.. రిటేన్‌ లిస్ట్‌లో ఉండే ప్లేయర్‌నే కెప్టెన్‌గా చేయాలని ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది.

మెగా వేలానికి ముందు విరాట్‌ కోహ్లీ, విల్‌ జాక్స్‌, రజత్‌ పాటిదార్‌లను ఆర్సీబీ రిటేన్‌ చేసుకోనున్నట్లు సమాచారం. అలాగే రజత్‌ పాటిదార్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ యంగ్‌ ప్లేయర్‌ కెప్టెన్సీ స్కిల్స్‌పై నమ్మకం ఉంచుతూ.. వచ్చే సీజన్‌లో జట్టును నడిపించే బాధ్యతను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే.. పాటిదార్‌పై చాలా పెద్ద భారం ఉన్నట్లే. విరాట్‌ కోహ్లీతో పాటు వేలంలో జట్టులోకి వచ్చే స్టార్‌ ప్లేయర్లను మేనేజ్ చేయడం అంత సులువైన విషయం కాదు. అయితే.. విరాట్‌ కోహ్లీ గత మూడు సీజన్లుగా కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నా.. ఫాఫ్‌ డుప్లెసిస్‌కి సలహాలు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రజత్‌ పాటిదార్‌ కెప్టెన్‌ అయితే.. కోహ్లీ షాడో కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. పాటిదార్‌కు గతంలో ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు కాబట్టి.. కోహ్లీ సలహాలు సూచనలు అతనికి ప్లస్‌ అవుతాయి.

మరోవైపు.. మరోసారి విరాట్‌ కోహ్లీకి సైతం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్సీబీ తరపున కప్పు కొట్టాలని కోహ్లీ ఎప్పటి నుంచో కలగంటున్నాడు. కానీ, అది ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా నెరవేరలేదు. అయితే.. చివరి సారిగా అతనే కెప్టెన్‌గా ఉంటూ కప్పు కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని కూడా ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఐపీఎల్‌ 2025లో కోహ్లీని ఒప్పించి.. మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని చూస్తోంది. ఒక వేళ అతన ఒప్పుకుంటే ఓకే లేదంటే.. సెకండ్‌ ఆప్షన్‌గా రజత్‌ పాటిదార్‌ ఉండనే ఉన్నాడు. సో.. ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీని పాటిదార్‌ లేదా కోహ్లీ నడిపంచే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments