Rahul Dravid: ద్రవిడ్​ బయోపిక్ తీస్తే హీరో ఆయనేనట.. మాజీ కోచ్ అదిరిపోయే ఆన్సర్!

ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, సంజయ్ దత్.. ఇలా ఎందరో సినీ, క్రీడా ప్రముఖుల జీవితాలపై సినిమాలు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి. తన లైఫ్​పై బయోపిక్ తీస్తే అందులో ఎవరు హీరోగా నటిస్తారనే ప్రశ్నకు భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, సంజయ్ దత్.. ఇలా ఎందరో సినీ, క్రీడా ప్రముఖుల జీవితాలపై సినిమాలు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి. తన లైఫ్​పై బయోపిక్ తీస్తే అందులో ఎవరు హీరోగా నటిస్తారనే ప్రశ్నకు భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, సంజయ్ దత్, కపిల్ దేవ్.. ఇలా ఎందరో సినీ, క్రీడా ప్రముఖుల జీవితాలపై సినిమాలు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి. స్టార్లు జీరో నుంచి హీరోలుగా ఎదిగిన తీరు, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వాటి నుంచి కమ్​బ్యాక్ ఇచ్చిన తీరు బయోపిక్స్​లో ఎక్కువగా హైలైట్ చేస్తుంటారు. ఇక మీదట కూడా మరిన్ని బయోపిక్స్ రానున్నాయి. దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ మూవీ రూపొందనుంది. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ టీ-సిరీస్ దీన్ని తెరకెక్కిస్తోంది. ఈ తరుణంలో ఓ ఈవెంట్​లో పాల్గొన్న టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్​కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన జీవితంపై బయోపిక్ తీస్తే అందులో ఎవరు హీరోగా నటిస్తారని ద్రవిడ్​ను క్వశ్చన్ అడిగారు.

సియట్ సంస్థ అవార్డుల కార్యక్రమానికి అతిథిగా విచ్చేశాడు ద్రవిడ్. ఈ సందర్భంగా అతడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన జీవితంపై బయోపిక్ తీస్తే అందులో ఎవరు హీరోగా నటిస్తారని అడిగారు. అయితే ద్రవిడ్ సూపర్బ్ ఆన్సర్ ఇచ్చాడు. భారీ రెమ్యూనరేషన్ ఇస్తానంటే తానే యాక్ట్ చేస్తానని అన్నాడు. ‘ఒకవేళ బాగా డబ్బులు ఇస్తామంటే నేనే ఆ రోల్​లో నటిస్తా’ అని ది వాల్ చెప్పాడు. దీంతో క్వశ్చన్ అడిగిన యాంకర్ సహా అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఎక్కువగా సీరియస్​గా ఉండే ద్రవిడ్ చాలా అరుదుగా నవ్వుతాడు. అలాంటిది అతడు ఇలా జోక్ వేసి అందర్నీ నవ్విస్తాడని ఎవరూ అనుకోలేదు. ఇక, లైఫ్ టైమ్ అఛీవ్​మెంట్​ అవార్డ్​కు ఎంపికవడంతో ద్రవిడ్​కు పురస్కారాన్ని బహూకరించి సత్కరించింది సియట్ సంస్థ.

సియట్ సంస్థ క్రికెట్ అవార్డుల వేడుకకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అటెండ్ అయ్యాడు. అతడ్ని నిర్వాహకులు దగ్గరుండి వేదిక మీదకు తీసుకొచ్చారు. రోహిత్, ద్రవిడ్ రాకతో ఈ ఈవెంట్​లో జోష్ వచ్చింది. కాగా, సియట్ క్రికెట్ అవార్డ్స్​లో విరాట్ కోహ్లీ మెరిశాడు. ఈ టాప్ ప్లేయర్​కు వన్డే బ్యాటర్ ఆఫ్​ ది ఇయర్ అవార్డు దక్కింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీకి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. బెస్ట్ టెస్ట్ బ్యాటర్​గా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్​ అవార్డుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్​లో రెండు జట్లను ఫైనల్స్​కు చేర్చినందుకు గానూ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు స్టార్ స్పోర్ట్స్ టీ20 లీడర్​షిప్ పురస్కారం దక్కింది. అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్​తో పాటు కోల్​కతా నైట్ రైడర్స్​ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్స్​కు చేరుకున్నాయి. మరి.. ద్రవిడ్ బయోపిక్​లో ఎవరు ఆయన రోల్​లో నటిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments