New NCA: బెంగళూరులో కొత్త క్రికెట్ అకాడమీ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సౌకర్యాలు!

Narendra Modi, New National Cricket Academy In Bengaluru: త్వరలోనే బెంగళూరులో ఓ కొత్త క్రికెట్ అకాడమీ ప్రారంభం కాబోతోంది. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో దీన్ని బీసీసీఐ నిర్మించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. మరి దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి.

Narendra Modi, New National Cricket Academy In Bengaluru: త్వరలోనే బెంగళూరులో ఓ కొత్త క్రికెట్ అకాడమీ ప్రారంభం కాబోతోంది. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో దీన్ని బీసీసీఐ నిర్మించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. మరి దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి.

BCCI.. భారత క్రికెట్ ను నూతన శకం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకోసం అనేక చర్యలను చేపడుతూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఓ కొత్త క్రికెట్ అకాడమీని నిర్మించింది. కోట్లాది రూపాయాలు వెచ్చించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ అకాడమీని నిర్మించారు. కాగా.. దీన్ని ఈ నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక ఈ అకాడమీలో ఉన్న సౌకర్యాలు చూస్తే.. వావ్ అంటూ షాక్ అవ్వాల్సిందే. మరి ఈ కొత్త ఎన్సీఏలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

భారతదేశంలో ఓ కొత్త క్రికెట్ అకాడమీ ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీసీఐ ఈ నిర్మాణానికి పూనుకుంది. దాదాపు రూ. 500 కోట్లతో ఈ అకాడమీని బెంగళూరులో నిర్మించారు. ప్రపంచ స్థాయి వసతులతో దీన్ని నిర్మించారు. వరల్డ్ లో ఎక్కడా లేని విధంగా.. అన్నీ ఒకే చోట ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం బెంగళూరులోనే ఓ క్రికెట్ అకాడమీ ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రారంగణంలోనే ఇది నడుస్తోంది.

అయితే.. ప్రస్తుతం ఉన్న ఎన్సీఏ కట్టి రెండు దశాబ్దాలకు పైగానే అవుతోంది. దాంతో బీసీసీఐ కొత్త అకాడమీని నిర్మించాలనుకుంది. కానీ చాలా ఏళ్ల వరకు శంకుస్థాపనకు నోచుకోలేదు. 2019లో జై షా ఈ నూతన అకాడమీకి శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలో కోవిడ్-19 ఎటాక్ అవ్వడంతో.. పనులకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ 2022లో పనులు ప్రారంభం అయ్యి.. ప్రస్తుతం ఓపెనింగ్ కు రెడీ అయ్యింది. రూ 500 కోట్లతో దీన్ని నిర్మించారు. భారత్ కు ఈ అకాడమీ మచ్చుతునకగా నిలుస్తుందని క్రీడా పండితులు చెబుతున్నారు. అంతలా సౌకర్యాలు ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.

కొత్త అకాడమీ ప్రత్యేకతలు

ప్రపంచంలో ఎక్కడా లేని సౌకర్యాలు ఈ కొత్త అకాడమీలో ఉన్నాయి. ఇందులో 3 ప్రపంచ స్థాయి స్టేడియాలతో పాటుగా 45 ప్రాక్టీస్ పిచ్, ఇండోర్ పిచ్, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, రికవరీ, న్యూ ఏజ్ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైన్స్ లాంటివి ఉన్నాయి. ఇక 243 గదులు ఉన్నాయి. అంతే కాకుండా.. 16 వేల చదరపు మీటర్లలో జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. ఇందులోనే బ్యాంక్, కొరియర్, సెలూన్, ఏటీఎం లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. పాత ఎన్సీఏ కంటే కూడా ఇది చాలా పెద్దది. ఇక ఈ అకాడమీ భారత క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి భారత్ లో మరో కొత్త క్రికెట్ అకాడమీ వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో నిర్మించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments