వరల్డ్ కప్ లో కోహ్లీకి పోటీ ఇస్తున్న హారిస్ రౌఫ్! ఏ విషయంలో అంటే?

  • Author Soma Sekhar Updated - 05:40 PM, Sat - 11 November 23

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో చెత్త రికార్డులన్నింటినీ తన పేరిట లిఖించుకుంటున్నాడు పాక్ పేసర్ హారిస్ రౌఫ్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి పోటీఇస్తున్నాడు. మరి ఏ విషయంలో రౌఫ్ కోహ్లీకి పోటీ ఇస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో చెత్త రికార్డులన్నింటినీ తన పేరిట లిఖించుకుంటున్నాడు పాక్ పేసర్ హారిస్ రౌఫ్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి పోటీఇస్తున్నాడు. మరి ఏ విషయంలో రౌఫ్ కోహ్లీకి పోటీ ఇస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Updated - 05:40 PM, Sat - 11 November 23

ప్రపంచ కప్ 2023లో దాయాది దేశమైన పాకిస్థాన్ దారుణంగా విఫలమై.. వరల్డ్ కప్ నుంచి ఇంటిదారి పట్టింది. ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీలో ఆడిన 8 మ్యాచ్ ల్లో సగం గెలిచి.. సగం ఓడిపోయింది. దీంతో పాక్ ఇంటికి వెళ్లక తప్పలేదు. ఇక ప్రస్తుతం జరుగుతున్న విశ్వసమరంలో పాక్ ఆటతీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఆ జట్టు మాజీ ప్లేయర్లు. ఇదంత ఓవైపు అయితే.. దాయాది దేశం ఆటగాళ్లు మూటగట్టుకుంటున్న చెత్త రికార్డులు మరోవైపు. ఇక ఈ టోర్నీలో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి పోటీ ఇస్తున్నాడు పాక్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్. ఇప్పటికే ఎన్నో చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకున్న రౌఫ్ కు ఈ ప్రపంచ కప్ ఓ పీడకలలా తయ్యారు అయ్యింది. మరి కోహ్లీకి ఏ విషయంలో రౌఫ్ పోటీ ఇస్తున్నాడో తెలుసుకుందాం.

హారిస్ రౌఫ్.. వరల్డ్ క్లాస్ బౌలర్ అని, పాక్ జట్టులో ఉన్న స్టార్ పేసర్లలో రౌఫ్ ఒకడని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ వారందరి అభిప్రాయాలు తప్పని ఈ ప్రపంచ కప్ లో రుజువైంది. ప్రతీ మ్యాచ్ లో రౌఫ్ బౌలింగ్ ను ఊచకోత కోస్తున్నారు ప్రత్యర్థి బ్యాటర్లు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రౌఫ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుని అప్రతిష్టపాలైయ్యాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు, రన్స్ ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు రౌఫ్. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు 6 ఓవర్లు వేసి 44 రన్స్ ఇచ్చాడు. ఇందులో 11 వైడ్స్ ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ లో 500 పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా మరో అప్రతిష్ట మూటగట్టుకున్నాడు పాక్ పేసర్. దీంతో సోషల్ మీడియాలో రౌఫ్ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు. ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు వేటలో ముందున్న కోహ్లీకి.. ఎక్కువ రన్స్ బ్యాటర్లకు సమర్పిస్తూ.. రౌఫ్ పోటీగా నిలుస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు సగటు క్రికెట్ అభిమానులు.

కాగా.. తాజాగా ఇంగ్లాండ్ తో ఆడుతున్న మ్యాచ్ వరకు 513 పరుగులు ఇచ్చి.. 14 వికెట్లు పడగొట్టాడు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ ఈ ప్రపంచ కప్ లో 543 రన్స్ తో టాప్ స్కోరర్ లిస్ట్ లో కొనసాగుతున్నాడు. దీంతో వీరిద్దరి స్కోర్లను పోలుస్తూ.. రౌఫ్ ను ట్రోల్ చేస్తున్నారు. కాగా.. రౌఫ్ కంటే ముందు 525 రన్స్ ప్రత్యర్థి బ్యాటర్లలకు ఇచ్చుకున్నాడు లంక పేసర్ మధుశంక. కానీ అతడు ఈ టోర్నీలో 21 వికెట్లు పడగొట్టడం గమనార్హం. మరి పరుగులు ఇవ్వడంతో విరాట్ కోహ్లీతో పోటీపడుతున్న పాక్ పేసర్ హారిస్ రౌఫ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments