Somesekhar
తాజాగా ఓ క్రికెట్ వైబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ల పేరును వెల్లడించాడు యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని ఆ ఇద్దరిని తన ఫేవరెట్ గా చెప్పుకొచ్చాడు.
తాజాగా ఓ క్రికెట్ వైబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ల పేరును వెల్లడించాడు యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని ఆ ఇద్దరిని తన ఫేవరెట్ గా చెప్పుకొచ్చాడు.
Somesekhar
నితీశ్ కుమార్ రెడ్డి.. 2024 ఐపీఎల్ సీజన్ లో సంచలన ప్రదర్శన చేసి.. ఎమర్జింగ్ ప్లేయర్ గా అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్ లో మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగిన నితీశ్ సంచలన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరడంలో ఇతడి పాత్రను తక్కువ చేయలేం. దాంతో టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు. జింబాబ్వే సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. గాయం కారణంగా ఆఖరి నిమిషయంలో జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక తాజాగా ఓ క్రికెట్ వైబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ల పేరును వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని వారిని తన ఫేవరెట్ గా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్ లో చూపించిన అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు సన్ రైజర్స్ సంచలన ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి. జింబాబ్వే సిరీస్ కు ఎంపిక అయ్యాడు. కానీ.. గాయం కారణంగా చివరి నిమిషయంలో జట్టుకు దూరమైయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. త్వరలోనే టీమిండియాలోకి వస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన ఫేవరెట్ క్రికెటర్ల పేర్లను వెల్లడించాడు.
నితీశ్ మాట్లాడుతూ..”2024 ఐపీఎల్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా నాకు మెసేజ్ చేశాడు. నేను గ్రౌండ్ లో చూపించిన ఇంటెంట్, ఎనర్జీ బాగున్నాయని, ఇలాగే ఆటను గౌరవిస్తూ.. ఆడాలని సూచించాడు. టీ20 వరల్డ్ కప్ లో బిజీగా ఉండి కూడా నాకు ఇలా మెసేజ్ చేయడంతో నేను షాక్ కు గురైయ్యాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఓ ఆల్ రౌండర్ గా నేను హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్ ను ఆరాధిస్తాను. ఇక కోహ్లీని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు నితీశ్ కుమార్ రెడ్డి. అయితే ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని పాండ్యా, బెన్ స్టోక్స్ పేర్లు చెప్పి షాక్ కు గురిచేశాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. మరి నితీశ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.