Nidhan
Musheer Khan Smashes Century: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ చెలరేగిపోయాడు. భారత జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఈ యంగ్ సెన్సేషన్ దులీప్ ట్రోఫీ ఓపెనర్‌లో సెంచరీతో కదం తొక్కాడు.
Musheer Khan Smashes Century: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ చెలరేగిపోయాడు. భారత జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఈ యంగ్ సెన్సేషన్ దులీప్ ట్రోఫీ ఓపెనర్‌లో సెంచరీతో కదం తొక్కాడు.
Nidhan
టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ గురించి క్రికెట్ లవర్స్‌కు బాగా తెలుసు. అన్నలా భారత జట్టులోకి వచ్చి సత్తా చాటాలని తహతహలాడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ డొమెస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి దుమ్మురేపుతున్నాడు. తాజాగా మరోమారు అతడు తన ప్రతాపం చూపించాడు. దులీప్ ట్రోఫీ-2024 ఫస్ట్ డేనే ఈ కుర్రాడు బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ (9) సహా యశస్వి జైస్వాల్ (30), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (13), రిషబ్ పంత్ (7), నితీష్ కుమార్ రెడ్డి (0) లాంటి స్టార్లంతా విఫలమైన చోట ముషీర్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. ప్రత్యర్థి జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నా లెక్కచేయకుండా జూలు విదిల్చి బ్యాటింగ్ చేశాడు.
94 పరుగులకే 7 మంది బ్యాటర్లు ఔట్ అయ్యారు. ప్రత్యర్థి జట్టులో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ లాంటి టీమిండియా స్టార్ బౌలర్లు ఉన్నారు. అయినా ముషీర్ తొణకలేదు, బెణకలేదు. తన బ్యాటింగ్ తాను చేసుకుంటూ పోయాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన అతడు 222 బంతుల్లో 10 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 105 పరుగులు చేశాడు. అవతలి ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోయినా ఒక్కడే జట్టును కష్టాల కడలి నుంచి బయటపడేశాడు. వికెట్లు పడుతున్నాయని అడ్డగోలు షాట్లు ఆడకుండా క్లాసికల్ బ్యాటింగ్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడు. టెయిలెండర్ నవ్‌దీప్ సైనీ (68 బంతుల్లో 25 నాటౌట్) అండతో చెలరేగిపోయాడు ముషీర్. ఖలీల్, కుల్దీప్, ఆవేశ్ బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్‌లో ఎక్కువ రన్స్ వెళ్లాయి.
ముషీర్-సైనీ జోడీ ఇండియా ఏ బౌలర్లకు కఠిన సవాల్ విసురుతున్నారు. ఒకవైపు ముషీర్ సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తుండగా.. మరోవైపు సైనీ వికెట్లకు అడ్డంగా నిలబడుతున్నాడు. ఒక ఎండ్‌ను తాను కాపాడితే చాలు.. మరోవైపు ముషీర్ పరుగులు చేస్తాడనే భరోసాతో డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతడే గనుక సహకారం అందించకపోయి ఉంటే ఇండియా బీ ఎప్పుడో కుప్పకూలేది. స్టార్ బ్యాటర్లంతా విఫలమైనా సైనీ లాంటి బౌలర్ ఇచ్చిన సపోర్ట్‌తో ఇన్నింగ్స్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు ముషీర్. అతడు ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ఇప్పటికే 8వ వికెట్‌కు ముషీర్-సైనీ జంట 108 పరుగులు జోడించారు. ఈ జోడీ ఎంత సేపు క్రీజులో ఉంటే ఇండియా బీకి అంత మంచిది. భారీ స్కోరు ఆశలన్నీ వీరి మీదే ఉన్నాయి. అటు ఇండియా ఏ మాత్రం వీళ్లను త్వరగా ఔట్ చేసి బ్యాటింగ్‌కు రావాలని చూస్తోంది. మరి.. ముషీర్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
With the big names around him failing to make an impact, young Musheer Khan smashes a fighting ton in the Duleep Trophy match against India A. pic.twitter.com/h7lNRT8l4z
— Cricbuzz (@cricbuzz) September 5, 2024