SNP
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాను నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఇదే అంటూ ఆ జట్టు కోచ్ తాజాగా వెల్లడించాడు. ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాను నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఇదే అంటూ ఆ జట్టు కోచ్ తాజాగా వెల్లడించాడు. ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని అందించే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇండియన్ క్రికెట్‌ను కుదిపేసిన అంశం వెనుక ఉన్న అసలు కారణాలను తాజాగా బౌచర్ వివరించాడు. అందేంటంటే.. ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతని ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడానికి గల అసలు కారణం ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ కోచ్‌గా బౌచర్ చెప్పిన ఈ విషయంపై క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. రెండు నెలల క్రితం.. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు హార్ధిక్ పాండ్యా మారిపోయిన విషయం తెలిసిందే. 2022 సీజన్ కంటే ముందుకు ముంబై ఇండియన్స్‌లోనే ఉన్న పాండ్యా.. 2022కి ముందు కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్‌కు మారిపోయాడు. ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పాండ్యా.. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2023 సీజన్‌లో ఫైనల్స్‌కు తీసుకెళ్లారు. ఆ జట్టు ఇంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా.. సడెన్‌గా మళ్లీకి ముంబైకి మారిపోయాడు.
ముందు ప్లేయర్‌గా వచ్చిన పాండ్యా.. అందరికీ షాకిస్తూ.. ముంబై యాజమాన్యం ఐపీఎల్ 2024 సీజన్ నుంచి పాండ్యా కెప్టెన్‌గా ఉంటాడని వెళ్లడించింది. దీంతో.. క్రికెట్ అభిమానులు ముంబై మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోశారు. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను ఎలా కెప్టెన్సీ నుంచి తీసేస్తారని ప్రశ్నించారు. చాలా మంది ముంబైని ఇన్‌స్టాలో అన్‌ఫాలో కూడా చేశారు. అయినా కూడా ముంబై రోహిత్‌ను ఎందుకు తొలగించిందో చెప్పలేదు. ఇప్పుడు ఆ జట్టు కోచ్.. కారణం ఇదే అంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేశాడు. ఇదోక క్రికెటింగ్ డిసిషన్ అని, రోహిత్ శర్మ ముంబైకి అత్యుత్తమ కెప్టెన్ అని, అలాగే టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ ఉన్నాడని, పైగా గత రెండు మూడు సీజన్లుగా సరిగా పరుగులు చేయడం లేదని, అందుకే అతనిపై కెప్టెన్సీ భారాన్ని తగ్గించేందుకే పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు బౌచర్ వెల్లడించాడు.
రాబోయే సీజన్లలో రోహిత్ శర్మ చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేస్తాడని.. ఎలాంటి ఒత్తిడి లేకుండా గేమ్‌ను ఎంజాయ్ చేస్తాడని భావిస్తున్నట్లు బౌచర్ పేర్కొన్నాడు. రోహిత్ గురించి పూర్తిగా ఆలోచించే.. ముంబై మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని, దాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోయారని వెల్లడించారు. ఇండియాలో చాలామంది భావోద్వేగాలతో ఉంటారని, కానీ, కొన్నిసార్లు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, హార్ధిక్ పాండ్యాను ముంబై కెప్టెన్‌గా చేయడం.. ట్రాన్సిషన్‌లో భాగంగా తాను చూస్తున్నట్లు బౌచర్ తెలిపాడు. అయితే.. బౌచర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ సతీమణి రితికా కామెంట్ చేస్తూ.. ఇందులో చాలా తప్పులు ఉన్నాయంటూ పేర్కొంది. ఇంత ఓపెన్‌గా తన భర్తకు అనాయ్యం జరిగింటూ రితికా ఎంఐపై తిరగబడ్డంపై రోహిత్ ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mumbai Indian head coach, Mark Boucher shares insights on Rohit Sharma’s journey in the upcoming IPL season. pic.twitter.com/h42lwTP0kS
— CricTracker (@Cricketracker) February 6, 2024
Ritika Sajdeh's comment on Mark Boucher's interview talking about Hardik Pandya taking over MI captaincy. (Smash Sports Podcast). pic.twitter.com/5sAAVa5xVu
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2024