Nidhan
MS Dhoni Spotted On Badminton Court: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్‌తో దుమ్మురేపడం కామనే. కానీ బ్యాడ్మింటన్ రాకెట్‌తోనూ అతడు చెలరేగిపోయాడు. తన చేతికి ఏదిచ్చినా అది ఆయుధంలాగే పని చేస్తుందని నిరూపించాడు.
MS Dhoni Spotted On Badminton Court: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్‌తో దుమ్మురేపడం కామనే. కానీ బ్యాడ్మింటన్ రాకెట్‌తోనూ అతడు చెలరేగిపోయాడు. తన చేతికి ఏదిచ్చినా అది ఆయుధంలాగే పని చేస్తుందని నిరూపించాడు.
Nidhan
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మల్టీ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. క్రికెట్ ఫీల్డ్‌లోకి దిగితే అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌తో పాటు కెప్టెన్సీతోనూ ఆకట్టుకుంటాడు మాహీ. గ్రౌండ్ దాటి బయటకు వచ్చాడా బైకులు వేసుకొని షికార్లకు వెళ్లిపోతాడు. తాను వాడే బైకులను అతడే స్వయంగా రిపేర్ చేసుకుంటాడు. ఫామ్‌హౌజ్‌లో వ్యవసాయం కూడా చేస్తుంటాడు ధోని. ఇలా తనకు నచ్చిన విషయాలను త్వరగా నేర్చుకొని వాటిపై పట్టు సాధించడంలో అతడికి అతడే సాటి. అలాంటోడు తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీశాడు. ఎప్పుడూ క్రికెట్ బ్యాట్‌తో దుమ్మురేపే మాహీ.. ఫర్ ఏ ఛేంజ్ అంటూ బ్యాడ్మింటన్ రాకెట్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఇంకేం ఉంది.. ప్రొఫెషనల్ ప్లేయర్లలా ఆడుతూ కోర్టులో రచ్చ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో బ్యాడ్మింటన్ కోర్డులో దుమ్మురేపాడు ధోని. 43 ఏళ్ల మాహీ బ్యాడ్మింటన్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అదిరిపోయే సర్వ్‌లు చేస్తూ, పవర్ఫుల్ స్మాష్‌లు కొడుతూ కనిపించాడు. అతడు బ్యాట్మింటన్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోర్టులో అటూ ఇటు పరుగులు తీస్తూ జంప్ చేసి స్మాష్ కొట్టిన తీరును చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఆ వయసులోనూ ఇంత ఫిట్నెస్ ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. తోపు ప్లేయర్ల మాదిరి అలవోకగా అంత పవర్ఫుల్ స్మాష్‌లు కొట్టడం ఏంటంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇది మాహీకి మాత్రమే సాధ్యమని.. ఇంతలా రెచ్చిపోవడం అతడి వల్లే అవుతుందని మెచ్చుకుంటున్నారు.
ధోని చేతిలో క్రికెట్ బ్యాట్, బ్యాడ్మింటన్ రాకెట్.. ఏది ఉన్నా రిజల్ట్‌లో ఛేంజ్ ఉండదని, దుమ్మురేపడం పక్కా అని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. అతడి చేతుల్లోకి వచ్చాక అవి ఆయుధాల్లా మారి గర్జిస్తాయని అంటున్నారు. ఇక, గత ఏడాదిన్నరగా కాలి గాయంతో బాధపడుతున్న మాహీ.. ఆ కారణం వల్లే ఈ ఐపీఎల్ సీజన్లో ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగుతూ వచ్చాడు. ఇంజ్యురీ ఎక్కువవుతుందనే భయంతో చివర్లో కొన్ని బంతులు ఆడేందుకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అలాంటిది తాజా బ్యాడ్మింటన్ వీడియోలో మాత్రం ఎగిరెగిరి స్మాష్‌లు కొడుతూ కనిపించాడు. అతడ్ని చూస్తే రికవర్ అయి ఫుల్ ఫిట్నెస్ సాధించినట్లు అనిపిస్తోంది. వచ్చే ఐపీఎల్లో రెచ్చిపోయి ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఆఖర్లో మెగా ఆక్షన్ ఉన్న నేపథ్యంలో మాహీ ఫ్యూచర్ ఏంటి? అతడ్ని సీఎస్కే ఏ విధంగా రీటెయిన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి.. ధోని బ్యాడ్మింటన్ వీడియోపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
MS DHONI PLAYING BADMINTON 🔥
– Thala smashing it…!!!! pic.twitter.com/epxE1WKuJW
— Johns. (@CricCrazyJohns) August 24, 2024