పంద్రాగస్టున ఇంటర్నేషనల్ కెరీర్​కు ధోని గుడ్​బై.. దాని వెనుక సీక్రెట్ బయటపెట్టిన రైనా!

MS Dhoni: ఇంటర్నేషనల్ క్రికెట్​కు లెజెండ్ ఎంఎస్ ధోని గుడ్​బై చెప్పి నాలుగేళ్లు పూర్తయింది. 2020, ఆగస్టు 15న అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాహీతో పాటు మరో దిగ్గజం సురేష్ రైనా కూడా అదే రోజు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

MS Dhoni: ఇంటర్నేషనల్ క్రికెట్​కు లెజెండ్ ఎంఎస్ ధోని గుడ్​బై చెప్పి నాలుగేళ్లు పూర్తయింది. 2020, ఆగస్టు 15న అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాహీతో పాటు మరో దిగ్గజం సురేష్ రైనా కూడా అదే రోజు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్​కు నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఆగస్టు 15, 2020న ఇంటర్నేషనల్ కెరీర్​కు మాహీ గుడ్​బై చెప్పేశాడు. అతడితో పాటు మరో దిగ్గజ ఆటగాడు సురేష్ రైనా కూడా అదే రోజున రిటైర్మెంట్ ప్రకటించాడు. ఏళ్ల పాటు నేషనల్ టీమ్​కు కలసి ఆడిన ఈ ఇద్దరు ప్లేయర్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ తరఫున ఆడుతూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. వన్డే ప్రపంచ కప్-2011 సహా ఎన్నో టోర్నీల్లో టీమిండియా తరఫున అదరగొట్టారు మాహీ-రైనా. ఏళ్ల పాటు భారత జట్టు భారాన్ని భుజాలపై మోసిన దిగ్గజాలు ఒకే రోజు రిటైర్మెంట్ అవడంతో అభిమానులు బాధను తట్టుకోలేకపోయారు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరారు.

రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వచ్చినా ధోని-రైనా అదే నిర్ణయానికి కట్టుబడ్డారు. అయితే పంద్రాగస్టు నాడే ఇద్దరూ ఎందుకు కెరీర్​కు గుడ్​బై చెప్పారనే సందేహం చాలా మందిలో నెలకొంది. మ్యాచ్​ ఆడి అభిమానుల సమక్షంలో గ్రాండ్​గా వీడ్కోలు తీసుకోకుండా హఠాత్తుగా ప్రకటన చేయడం ఏంటని షాకయ్యారు. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. కానీ నాలుగేళ్ల తర్వాత తాజాగా రైనా ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. తాము ఎందుకు ఆ రోజు రిటైర్మెంట్ తీసుకున్నామో రివీల్ చేశాడు. పంద్రాగస్టు నాడు రిటైర్మెంట్ తీసుకోవాలని ధోని, తాను ముందే డిసైడ్ అయ్యామని తెలిపాడు. దాని వెనుక ఓ కారణం ఉందని చెప్పాడు.

‘ఆగస్టు 15న రిటైర్మెంట్ గురించి అనౌన్స్​మెంట్ ఇవ్వాలని మేం ముందే నిర్ణయించుకున్నాం. దీనికి ఓ రీజన్ ఉంది. మాహీ భాయ్ జెర్సీ నంబర్ 7. నా జెర్సీ నంబర్ 3. ఈ రెండింటినీ కలిపితే 73 అవుతుంది. 2020, ఆగస్టు 15వ తేదీకి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యాయి. అందుకే రిటైర్మెంట్ ప్రకటనకు ఇంతకంటే మంచి తరుణం లేదని మేం భావించాం. అనుకున్నదే తడవుగా ఒకేసారి ఇంటర్నేషనల్ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాం. ధోనీతో నాది ప్రత్యేకమైన అనుబంధం. మేం ఇద్దరం దాదాపు 15 ఏళ్ల పాటు భారత జట్టుకు కలసి ఆడాం. రిటైర్ అయ్యాక ముందు ప్లాన్ చేసినట్లు ఐపీఎల్​లో కంటిన్యూ అయ్యాం’ అని రైనా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక, ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు ధోని. అయితే మెగా ఆక్షన్ నేపథ్యంలో వచ్చే ఏడాది అతడు క్యాష్ రిచ్ లీగ్​లో ఆడతాడా? లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు.

Show comments