MS Dhoni: ఐపీఎల్ 2025పై ధోని బిగ్ అప్​డేట్​.. ఇది మాత్రం ఎక్స్​పెక్ట్ చేయలేదు!

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చే ఐపీఎల్ సీజన్​ మీద బిగ్ అప్​డేట్ ఇచ్చాడు. తాను ఆడేది, లేనిది ఒక్క కామెంట్​తో అతడు తేల్చిపారేశాడు.

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చే ఐపీఎల్ సీజన్​ మీద బిగ్ అప్​డేట్ ఇచ్చాడు. తాను ఆడేది, లేనిది ఒక్క కామెంట్​తో అతడు తేల్చిపారేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని మళ్లీ గ్రౌండ్​లో చూసేందుకు ఆయన అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఐపీఎల్-2024లో మాహీ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్​కు వస్తూ ధనాధన్ ఇన్నింగ్స్​లతో మెరిశాడు. ఆరేడు బంతులే ఆడినా ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. మెరుపు ఇన్నింగ్స్​లతో టీమ్ భారీ స్కోరు అందుకోవడంలో తన కాంట్రిబ్యూషన్​ను అందించాడు. వింటేజ్ ధోనీని గుర్తుచేసేలా అతడి బ్యాటింగ్ సాగింది. సీఎస్​కే ప్లేఆఫ్స్​కు చేరుకోకపోయినా మాహీ తన ఆటతీరుతో ఫ్యాన్స్​కు ఫుల్ ఎంటర్​టైన్​మెంట్ అందించాడు.

గతేడాది ఐపీఎల్​ టైమ్​లో ధోని మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఆ సీజన్ ముగిసిన తర్వాత కాలికి సర్జరీ చేయించుకున్నాడు మాహీ. దాని నుంచి కోలుకున్నాక ఈ ఏడాది క్యాష్ రిచ్​ లీగ్​లో ఆడాడు. అయితే ఫుల్​గా రికవర్ కాకపోవడంతో ఈ సీజన్​ ఐపీఎల్​లో ఆఖరి రెండు ఓవర్లు ఉన్నప్పుడే బ్యాటింగ్​కు వచ్చాడు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసేందుకు శరీరం సహకరించకపోవడంతో ఈ డెసిషన్ తీసుకున్నాడు. దీంతో వచ్చే సీజన్​లో ధోని ఆడతాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. ఆల్రెడీ మూడ్నాలుగు సీజన్ల నుంచి అతడి ఐపీఎల్ రిటైర్మెంట్​పై వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ రూపంలో కెప్టెన్సీకి మంచి ఆప్షన్ దొరకడంతో ధోని లీగ్​కు గుడ్​బై చెబుతాడనే పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 గురించి అతడు బిగ్​ అప్​డేట్ ఇచ్చాడు. ఆడతానంటూనే మెలిక పెట్టాడు.

‘ఐపీఎల్-2025కు ఇంకా చాలా సమయం ఉంది. ప్లేయర్ రిటెన్షన్​తో పాటు ఇతర అంశాలపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అది బోర్డు చేతుల్లోనే ఉంది. కాబట్టి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయ్యాక లీగ్​లో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై నేను నిర్ణయం తీసుకుంటా. అయితే నేను ఏ డెసిషన్ తీసుకున్నా అది టీమ్​కు మంచి చేసేదిలాగే ఉండాలి. జట్టుకు ఏది మంచో అదే చేస్తా’ అని ధోని స్పష్టం చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్​లో ఆడతాడో లేదో మాహీ కచ్చితంగా చెప్పలేదు. తనకు ఆడాలనే ఉందని.. కానీ ప్లేయర్ల రిటెన్షన్​తో పాటు ఇతర అంశాల్లో బీసీసీఐ తీసుకునే నిర్ణయాల మీదే ఇది ఆధారపడుతుందని చెప్పాడు. కచ్చితంగా ఇంకో సీజన్ ఆడతాడని అనుకుంటే మాహీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? తాము ఇది ఎక్స్​పెక్ట్ చేయలేదని నెటిజన్స్ అంటున్నారు. మరి.. ధోని ఇంకో సీజన్ ఆడితే చూడాలని ఉందా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments