Mohammed Shami: బంగ్లాతో సిరీస్.. ఎంపిక కాకపోవడంపై ఎట్టకేలకు స్పందించిన షమీ! ఏమన్నాడంటే?

Mohammed Shami reacts to not select for Bangladesh Test series: బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్ కాకపోవడంపై స్పందించాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.

Mohammed Shami reacts to not select for Bangladesh Test series: బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్ కాకపోవడంపై స్పందించాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. మరోవైపు పాకిస్థాన్ ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి మంచి జోరుమీదుంది బంగ్లా టీమ్. అందుకే టీమిండియా సైతం వారిని తక్కువ అంచనా వేయడం లేదు. ఇక తొలి టెస్ట్ కోసం ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన టీమ్ ను అనౌన్స్ చేశారు. అయితే ఇందులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కలేదు. ఈ విషయం అదరిని షాక్ కు గురిచేసింది. తాజాగా తాను బంగ్లాతో సిరీస్ కు ఎంపిక కాకపోవడంపై తొలిసారి స్పందించాడు షమీ.

మహ్మద్ షమీ.. టీమిండియా స్టార్ పేసర్ గా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేస్ ఎటాక్ తో ప్రత్యర్థి ఆటగాళ్లకు సవాల్ విసురుతూ వికెట్ల వేటను కొనసాగిస్తుంటాడు. ఇక ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. టీమిండియా ఫైనల్ చేరడంలో షమీది కీలక పాత్ర. అయితే ప్రపంచ కప్ సందర్భంగా గాయపడిన షమీ.. శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించి.. ప్రాక్టీస్ సైతం మెుదలుపెట్టాడు. కానీ.. ఇతడిని మాత్రం బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయలేదు బీసీసీఐ. దాంతో మంచి ఫిట్ నెస్ లో ఉన్న షమీని ఎందుకు టీమ్ లోకి తీసుకోలేదు? అంటూ అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే టీమిండియాలోకి వచ్చే ముందు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కొత్తగా ఓ రూల్ తీసుకొచ్చింది.  కానీ షమీ దులీప్ ట్రోఫీలో ఆడటం లేదు. అయితే త్వరలో జరగబోయే రంజీ ట్రోఫీలో మాత్రం ఆడతానని స్పష్టం చేశాడు. ఇక ఎన్సీఏ షమీ పూర్తి ఫిట్ నెస్ సాధించాడు అని క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు కారణాలతో షమీని బంగ్లాతో సిరీస్ కు ఎంపిక చేయలేదని మేనేజ్ మెంట్ చెప్పుకొచ్చింది. కాగా.. తనను బంగ్లా సిరీస్ కు సెలెక్ట్ చేయకపోవడంపై ఎట్టకేలకు షమీ స్పందించాడు. “నేను ప్రస్తుతం ప్రాక్టీస్ మెుదలుపెట్టాను. అయితే నేను 100 శాతం ఫిట్ అని తెలిసినప్పుడే జట్టులోకి వస్తాను. అప్పటి వరకు రాను, అది న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియా తో జరిగే సిరీస్ కావొచ్చు. ఏదైనా ఇండియా కోసం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ షమీ. త్వరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో కోల్ కత్తా తరఫున బరిలోకి దిగుతానని షమీ పేర్కొన్నాడు. ఇక సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది.

Show comments