Mitchell Starc: షాకింగ్.. రిటైర్మెంట్ పై మిచెల్ స్టార్క్ కీలక ప్రకటన!

ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కేకేఆర్ కీలక బౌలర్ మిచెల్ స్టార్క్ తన రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కేకేఆర్ కీలక బౌలర్ మిచెల్ స్టార్క్ తన రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మిచెల్ స్టార్క్.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికంటే ముందే సంచలన సృష్టించిన ఆటగాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా స్టార్క్ రికార్డ్ నెలకొల్పాడు. రూ. 24. 75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ అతడిని వేలంలో సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్ ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్ ల్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. కేకేఆర్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు స్టార్క్. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన రిటైర్మెంట్ పై స్పందించాడు. కేకేఆర్ టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్క్.. ఇక నుంచి కేవలం రెండు ఫార్మాట్స్ లోనే ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై స్టార్క్ మాట్లాడుతూ..”గత 9 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాకు ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. కానీ ప్రస్తుతం నా శరీరం రెస్ట్ కోరుకుంటోంది. పైగా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. గతంలో కుటుంబంతో గడిపేందుకు కొన్నిసార్లు మాత్రమే విశ్రాంతి తీసుకునేవాడిని. ఇక 2027 వరల్డ్ కప్ చాలా దూరం ఉంది. దాంతో నేను వన్డే లేదా టెస్టుల్లో మాత్రమే కనిపించే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు టీ20 క్రికెట్ పై ఎక్కువ సమయం కేటాయించవచ్చు” అని చెప్పుకొచ్చాడు. దాంతో స్టార్క్ వన్డేలకు లేదా టెస్టుల్లో ఏదో ఒక ఫార్మాట్ కు త్వరలోనే వీడ్కోలు పలకబోతున్నాడు అని స్పష్టమైంది.

కాగా.. టీ20 వరల్డ్ కప్ ముందు ఐపీఎల్ మంచి ప్రాక్టీస్ అని చెప్పిన స్టార్క్.. భారత్ లో పిచ్ లు మాదిరి వెస్టిండీస్, అమెరికా పిచ్ లు ఉండవు అంటూ చెప్పుకొచ్చాడు. భారీ స్కోర్ నమోదు కావని, పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని అభిప్రాయపడ్డాడు. టోర్నీ ముందుకు సాగేకొద్ది బౌలర్లు కీలకంగా మారుతారని సూచించాడు. మరి మిచెల్ స్టార్క్ ఏ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతాడు అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments