LSGకి గుడ్‌బై.. RCB కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌? మరి డుప్లెసిస్‌ పరిస్థితి?

KL Rahul, RCB, LSG, IPL 2025: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్‌ కోహ్లీతో కలిసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

KL Rahul, RCB, LSG, IPL 2025: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్‌ కోహ్లీతో కలిసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఐపీఎల్‌లో ఉన్న పది టీమ్స్‌లో భారీ క్రేజ్‌, అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఆ క్రేజ్‌కి కారణం విరాట్‌ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 17 ఏళ్ల ఐపీఎల్‌ ప్రస్థానంలో ఆర్సీబీ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గకపోయినా.. ఆ జట్టు ఖాతాలో ఐపీఎల్‌ ట్రోఫీ లేకపోవడం, ఆ టీమ్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఆ లోటు తీర్చుకోవడానికి ఆర్సీబీ చాలా ప్రయోగాలు చేసింది. వచ్చే ఐపీఎల్‌ 2025 సీజన్‌లో కూడా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసి.. ఎలాగైన కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌. అందుకోసం తన మాజీ ప్లేయర్‌ను ఈ సారి కెప్టెన్‌గా టీమ్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది.

గతంలో ఆర్సీబీ తరఫున ఆడిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ను తమ టీమ్‌లోకి తెచ్చుకునేందుకు ఆర్సీబీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఐపీఎల్‌ 2025లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా రాహుల్‌ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌తో చర్చలు జరిపినట్లు, అలాగే విరాట్‌ కోహ్లీ కూడా ఈ విషయంపై రాహుల్‌తో మాట్లాడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌ నుంచి రిటైర్‌ అయ్యేలోపు కప్పు కొట్టాలనే టార్గెట్‌తో ఉన్న కోహ్లీ.. అందుకోసం ఇదే మంచి ఛాన్స్‌ అని భావిస్తున్నాడు. ఐపీఎల్‌ 2025 కోసం బెస్ట్‌ టీమ్‌ను బిల్డ్‌ చేసుకొని కప్పు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ సైతం కోహ్లీ ఒక్కడినే రీటెన్‌ చేసుకొని, మిగతా టీమ్‌ అంతా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇక విరాట్‌ కోహ్లీ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ను సైతం ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ రిలీజ్‌ చేయనుంది. మరోవైపు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సైతం తమ టీమ్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించుకునే ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్‌ ఎల్‌ఎస్‌జీని వీడి.. ఆర్సీబీలో చేరేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌కు మంచి ఫ్యూచర్‌ ఉండే అవకాశం ఉంది. రాహుల్‌ ఎలాగో కర్ణాటకకు చెందిన ఆటగాడే కావడంతో హోం టీమ్‌కు ఆడుతున్న ఫీలింగ్‌ కూడా పొందొచ్చు అని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి కేఎల్‌ రాహుల్‌ ఆర్సీబీలోకి తిరిగి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments