KL Rahul: కేఎల్ రాహుల్ స్పెషల్ ఇన్నింగ్స్.. అడ్డుగోడలా నిలబడ్డాడు!

KL Rahul, Duleep Trophy 2024, IND B vs IND A: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహల్ తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో క్లాసికల్ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు.

KL Rahul, Duleep Trophy 2024, IND B vs IND A: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహల్ తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో క్లాసికల్ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు.

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహల్ తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో క్లాసికల్ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా ఇండియా బీపై స్పెషల్ బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు రాహుల్. వరుసగా వికెట్లు పడుతున్నా ఒక ఎండ్​లో అడ్డుగోడలా నిలబడ్డాడీ స్టార్ బ్యాటర్. వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు స్కోరు బోర్డును ముందుకు కదిలించేందుకు శాయశక్తులా ట్రై చేశాడు. అయితే ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. నాలుగో నంబర్​లో బ్యాటింగ్​కు దిగిన రాహుల్ 7వ వికెట్​గా వెనుదిరిగాడు. అతడు ఉన్నంత సేపు మ్యాచ్ ఇండియా ఏ కంట్రోల్​లోనే ఉంది. ఒకవైపు వికెట్లు పతనమవుతున్నా, ప్రత్యర్థి బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నా రాహుల్ మాత్రం కూల్​గా బ్యాటింగ్ చేశాడు.

యాంకర్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్.. 121 బంతుల్లో 57 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగడంతో అతడు ఎలాంటి టెన్షన్ పడకుండా ఆడాడు. అక్కడి పిచ్, పరిస్థితులు కొట్టిన పిండి కావడంతో తన ఆట తాను ఆడుకుంటూ పోయాడు. అయితే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (3), కెప్టెన్ శుబ్​మన్ గిల్ (21) సహా రియాన్ పరాగ్ (31), ధృవ్ జురెల్ (0) లాంటి ప్రధాన బ్యాటర్లంతా విఫలమవడంతో ఇండియా ఏకు ఓటమి తప్పలేదు. రాహుల్ ఒక్కడు యోధుడిలా ఆఖరి వరకు నిలబడి చేసిన ఒంటరి పోరాటం వృథాగా మారింది. అతడు చేసింది 57 పరుగులే కావొచ్చు.. కానీ ఆ ఇన్నింగ్స్ లేకపోతే ఆ జట్టు వంద లోపే చాప చుట్టేసేది. కుల్దీప్ యాదవ్​ (14)తో కలసి ఇండియా బీ బౌలర్లను అతడు విసిగించాడు. వికెట్లు పడకపోవడం, స్కోరు బోర్డు మీదకు రన్స్ వస్తుండటంతో ప్రత్యర్థి టీమ్ సతమతమైంది.

ఎప్పటికీ గుర్తుండిపోయే నాక్ ఆడిన రాహుల్​ ఆఖరికి ముకేశ్ కుమార్ బౌలింగ్​లో కీపర్ రిషబ్ పంత్​కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు ఔట్ అయి వెళ్లిపోతున్న టైమ్​లో స్టేడియంలోని ఆడియెన్స్, ఇండియా బీ ప్లేయర్లు మెచ్చుకున్నారు. ఫ్యాన్స్ చప్పట్లు కొడుతూ అభినందించారు. రాహుల్ ఔట్ అయ్యాక ఇండియా ఏ కుప్పకూలడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. ఆకాశ్​దీప్ (43) కాసేపు మెరుపులు మెరిపించాడు. 3 బౌండరీలు, 4 సిక్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అతడే ఆఖరి వికెట్​గా వెనుదిరిగాడు. దీంతో 275 పరుగుల ఛేదనకు దిగిన ఇండియా ఏ 198 పరుగులకు ఆలౌట్ అయింది. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలోని ఇండియా బీ చేతుల్లో 76 పరుగుల తేడాతో గిల్ సేన ఓటమిపాలైంది. మరి.. రాహుల్ ఇన్నింగ్స్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments