Somesekhar
Joe Root Break Sachin Tendulkar Record: శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ క్రేజీ రికార్డును బ్రేక్ చేశాడు.
Joe Root Break Sachin Tendulkar Record: శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ క్రేజీ రికార్డును బ్రేక్ చేశాడు.
Somesekhar
జో రూట్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో మారుమోగుతున్న పేరు. మంచినీళ్లు తాగినంత ఈజీగా అతడు రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్ ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ సిరీస్ సొంతం చేసుకోవడంలో రూట్ ది కీలక పాత్ర. మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో ఏకంగా 3 సెంచరీలతో 375 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్ లో దుమ్మురేపిన ఈ స్టార్ ప్లేయర్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అదీకాక ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ప్లేయర్ గా చరిత్రకెక్కాడు.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో పరుగుల వరదపారించాడు ఈ వెటరన్ ప్లేయర్. మూడు టెస్టుల్లో 3 సెంచరీలతో సహా 375 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు రూట్. ఇక అద్బుత ఆటతీరు కనబర్చిన రూట్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో రూట్ టీమిండియా లెజెండ్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా.. సచిన్ తన కెరీర్ లో 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ ను గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. రూట్ తన కెరీర్ లో 6 సార్లు(ఇప్పటి అవార్డుతో కలిపి) ఈ అవార్డ్స్ ను దక్కించుకున్నాడు.
కాగా.. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ప్లేయర్ గా కూడా రూట్ నిలిచాడు. ఈ క్రమంలోనే గ్రహమ్ గూమ్, అండ్రూ స్ట్రాస్, జేమ్స్ అండర్సన్ లను అధిగమించాడు. ఇక ఈ జాబితాలో మార్కమ్ మార్షల్, కర్ట్లీ అంబ్రోస్, స్టీవాలతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. కాగా.. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లు గెలుచుకున్న ప్లేయర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. అతడు ఏకంగా 11 సార్లు ఈ ఘనత సాధించాడు. మురళీధరన్ రికార్డును త్వరలోనే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బద్దలు కొట్టనున్నాడు. అశ్విన్ 10 సార్లు ఈ అవార్డును దక్కించుకున్నాడు. మరి మంచినీళ్లు తాగినంత ఈజీగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న జో రూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
JOE ROOT BROKE SACHIN TENDULKAR RECORD AFTER WINNING 6TH MoTS Award
-Joe Root recently played a 3-match Test cricket series against Sri Lanka. In this he scored a total of 375 runs in 3 matches. Joe Root also took 1 wicket bowling in this series. #WWERaw pic.twitter.com/cBqDxRT624
— SportsKreeda (@sportskreda_ply) September 10, 2024