SNP
Jacques Kallis, KKR, IPL 2025, Gautam Gambhir: రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ టీమ్ సపోర్టింగ్ స్టాఫ్ స్ట్రెంత్‌ను పెంచుకునే పనిలో పడింది. అందుకోసం.. గౌతమ్ గంభీర్‌కు గట్టి రిప్లేస్‌మెంట్‌ను కూడా వెతికేసింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Jacques Kallis, KKR, IPL 2025, Gautam Gambhir: రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ టీమ్ సపోర్టింగ్ స్టాఫ్ స్ట్రెంత్‌ను పెంచుకునే పనిలో పడింది. అందుకోసం.. గౌతమ్ గంభీర్‌కు గట్టి రిప్లేస్‌మెంట్‌ను కూడా వెతికేసింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీమ్‌కు మెంటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు అంటే.. ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు మెంటర్‌గా ఉన్నాడు. తన మెంటర్న్‌షిప్‌లో లక్నో రెండు సీజన్లలోనూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. అలాగే ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ ఏకంగా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా రావడంతో కేకేఆర్ టీమ్‌లో మెంటర్ పోస్టు ఖాళీ అయింది. మరి ఆ పోస్ట్‌ను భర్తీ చేసేందుకు కేకేఆర్ వద్ద రెండు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ రెండు ఆప్షన్లు ఏంటి? ఫైనల్‌గా ఎవరు మెంటర్ అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
గంభీర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ మేనేజ్‌మెంట్ ముందుగా ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంది. వారిలో సౌతాఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్ జాక్వెస్ కల్లీస్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగాక్కరలో ఒకరి తమ టీమ్ మెంటర్‌గా నియమించుకొని.. గంభీర్ స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంది. రాజస్తాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తమ కొత్త హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించుకోవడంతో.. ఇక సంగాక్కర.. ఆర్‌ఆర్‌ను వీడుతాడని కేకేఆర్ భావించింది. కానీ, అతను అదే టీమ్‌లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ హోదాలో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగాక్కరను లిస్ట్‌ను తీసేశారు. ఇక మిగిలింది.. కల్లీస్, పాంటింగ్.
ఈ ఇద్దరు క్రికెటర్లు గతంలో కేకేఆర్ తరఫున ఆడిన వాళ్లే. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో పాంటింగ్ కేకేఆర్‌లోనే ఆడాడు. ఆ తర్వాత ముంబైకి మారాడు. ఇక కల్లీస్ అయితే ఐపీఎల్ స్టార్టింగ్‌లో ఆర్సీబీకి ఆడినా.. కేకేఆర్‌లోనే ఎక్కువ కాలం కొనసాగాడు. పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాంటింగ్‌ను తన మెంటర్‌గా తీసుకోవాలని కేకేఆర్ భావిస్తోంది. అలాగే కల్లీస్ కూడా వాళ్ల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కల్లీస్ అయితే బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లను ట్రైన్ చేసే అవకాశం ఉండటంతో.. పాంటింగ్ కంటే కల్లీస్ బెస్ట్ ఆప్షన్ అని కేకేఆర్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒక వేళ అదే జరిగితే.. గంభీర్ స్థానంలో కేకేఆర్ మెంటర్‌గా ఐపీఎల్ 2025 సీజన్‌లో కల్లీస్ రావొచ్చు. మరి కల్లీస్ కేకేఆర్ మెంటర్‌గా ఉంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KKR are looking for a new mentor..#KKR #iplhttps://t.co/VTGZPoqa1L
— Crictoday (@crictoday) September 9, 2024