Simi Singh: నా భార్య వల్లే బతికున్నా.. సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ క్రికెటర్!

Simi Singh has undergone a successful liver operation: ఐర్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సిమ్రన్ జిత్ సింగ్ తనకు విజయవంతంగా లివర్ ఆపరేషన్ జరిగిందని స్వయంగా వెల్లడించాడు. తన భార్యే దాతగా దొరికి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చాడు.

Simi Singh has undergone a successful liver operation: ఐర్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సిమ్రన్ జిత్ సింగ్ తనకు విజయవంతంగా లివర్ ఆపరేషన్ జరిగిందని స్వయంగా వెల్లడించాడు. తన భార్యే దాతగా దొరికి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చాడు.

నా భార్య వల్లే నేను ఈ రోజు బతికున్నానని, లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని షాకింగ్ విషయాలు వెల్లడించాడు ఐర్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సిమ్రన్ జిత్ సింగ్. ఇక తనకు సక్సెస్ ఫుల్ గా సర్జరీ జరిగిందని, డాక్టర్లు 12 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారని చెప్పుకొచ్చాడు. తన భార్య దాతగా మారి ప్రాణాలు కాపాడిందని పేర్కొన్నాడు ఈ ఐర్లాండ్ ప్లేయర్. అసలేం జరిగిందంటే?

సిమ్రన్ జిత్ సింగ్.. ఐర్లాండ్ కు చెందిన ఈ స్టార్ ఆల్ రౌండర్ కు విజయవంతగా కాలేయ మార్పిడి జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. “యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ నాకు కొందరు ప్రిస్కైబ్ చేశారు. వాటిని వాడటంతోనే నా లివర్ డ్యామేజ్ అయ్యింది. దాంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నా భార్య నాకు లివర్ దాత కావడం నిజంగా నా అదృష్టం. ఆమె వల్లే నేను ఈరోజు బతికున్నాను. సర్జరీ విజయవంతంగా ముగిసింది. డాక్టర్లు 12 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. ఇక నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు సిమ్రన్ జిత్ సింగ్. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

కాగా.. సిమ్రన్ జిత్ సింగ్ పంజాబ్ లోని మెుహాలీలో జన్మించాడు. భారత దేశవాళీ క్రికెట్ లో అండర్ 14, అండర్ 17 విభాగంలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ అండర్ 19 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అవకాశాలు రాకపోవడంతో.. మళ్లీ చదువు వైపు వెళ్లాడు. ఈ క్రమంలో 2005లో ఐర్లాండ్ వెళ్లి హోటల్ మేనేజ్ మెంట్ చేశాడు. కానీ క్రికెట్ పై ప్రేమ చావకపోవడంతో.. అటువైపుగా ప్రయత్నాలు మెుదలుపెట్టాడు. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2020లోనే సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు.

ఇక సిమ్రన్ జిత్ సింగ్ ఐర్లాండ్ తరఫున ఇప్పటి వరకు 35 వన్డేలు ఆడి 39 వికెట్లు తీయగా.. 53 టీ20ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. దాంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం సిమ్రన్ జిత్ సింగ్ లివర్ పాడైందని, ట్రీట్మెంట్ కోసం ఇండియా తీసుకొచ్చామని, గురుగ్రామ్ లో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని ఇటీవలే కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు లివర్ సర్జరీ విజయవంతం అయినట్లు స్వయంగా అతడే తెలియజేశాడు. మరి భార్యే దాతగా మారి భర్తను బతికించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments