ఆ రాష్ట్ర ప్లేయర్లు టీమ్ లో ఉంటే వరల్డ్ కప్పులు మనవే! ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ రిపీట్..

2007 టీ20 వరల్డ్ కప్ నుంచి నిన్న గెలిచిన టీ20 వరల్డ్ కప్ వరకు ఓ సెంటిమెంట్ నిజమవుతూ వస్తోంది. అదేంటంటే? ఆ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు జట్టులో ఉంటే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

2007 టీ20 వరల్డ్ కప్ నుంచి నిన్న గెలిచిన టీ20 వరల్డ్ కప్ వరకు ఓ సెంటిమెంట్ నిజమవుతూ వస్తోంది. అదేంటంటే? ఆ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు జట్టులో ఉంటే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏ రంగంలో అయినా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఆ సెంటిమెంట్స్ కొన్ని సార్లు విజయాలకు కారణం అయితే.. మరికొన్ని సమయాల్లో అపజయాలకు కారణం అవుతాయి. తాజాగా టీమిండియా విషయంలో మరీ ముఖ్యంగా ప్రపంచ కప్ ల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. 2007 టీ20 వరల్డ్ కప్ నుంచి నిన్న గెలిచిన టీ20 వరల్డ్ కప్ వరకు ఈ సెంటిమెంట్ నిజమవుతూ వస్తోంది. అదేంటంటే? ఆ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు జట్టులో ఉంటే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా. ఇది నేను చెప్పేది కాదు.. చరిత్ర చెప్తుంది.

టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి.. తన 13 ఏళ్ల వరల్డ్ కప్ కలను నెరవేర్చుకుంది. ఇక ఈ ప్రపంచ కప్ ను గెలవడం ద్వారా ఓ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ గురించి వింటే మీకు కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఇంతకీ అదేంటంటే? 2007 టీ20 వరల్డ్ కప్ నుంచి కేరళకు చెందిన ఆటగాళ్లు ప్రపంచ కప్ టీమ్ లో ఉంటే.. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడం జరుగుతోంది. గతంలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ జట్లలో టీమిండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్ సభ్యుడిగా న్నాడు. ఆ సంవత్సరాల్లో భారత్ వరల్డ్ కప్స్ నెగ్గింది.

ఇక ఈ టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్వ్కాడ్ లో కేరళకు చెందిన సంజూ శాంసన్ ను ఉన్నాడు. ఈ ప్రపంచ కప్ ను కూడా టీమిండియా గెలుచుకుంది. దాంతో మరోసారి కేరళ ప్లేయర్ల సెంటిమెంట్ రిపీట్ అయ్యింది అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో కూడా సునీల్ వాల్సన్ అనే క్రికెటర్ కేరళ సంతతికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. దాంతో ఈ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయ్యింది. మరి ఈ విచిత్రమైన సెంటిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments