Nidhan
India vs Zimbabwe: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంపర్ విక్టరీ కొట్టడంతో ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి వెంటనే తేరుకొని భారీ విజయం సాధిండంతో హ్యాపీగా ఉంది. ఈ తరుణంలో గిల్ సేనకు మరో గుడ్ న్యూస్.
India vs Zimbabwe: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంపర్ విక్టరీ కొట్టడంతో ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి వెంటనే తేరుకొని భారీ విజయం సాధిండంతో హ్యాపీగా ఉంది. ఈ తరుణంలో గిల్ సేనకు మరో గుడ్ న్యూస్.
Nidhan
టీ20 వరల్డ్ కప్ సంబురాలు ముగియక ముందే మరో సిరీస్‌తో బిజీ అయిపోయింది టీమిండియా. జింబాబ్వే జట్టుతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది మెన్ ఇన్ బ్లూ. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్ 1-1తో సమానంగా ఉంది. పసికూన జట్టు కదా ఏం చేయగలదని జింబాబ్వేను అంతా లైట్ తీసుకున్నారు. కానీ తొలి మ్యాచ్‌లో గిల్ సేనకు ఆ జట్టు షాక్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించి తమను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరికలు పంపించింది జింబాబ్వే. అయితే ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100) సెంచరీతో చెలరేగి మ్యాచ్‌ను వన్ సైడ్ చేశాడు. అతడితో పాటు రుతురాజ్ గైక్వాడ్ (77 నాటౌట్), రింకూ సింగ్ (48 నాటౌట్) కూడా సూపర్బ్ నాక్స్‌తో సత్తా చాటారు.
బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ చెరో 3 వికెట్లతో అదరగొట్టారు. వీళ్లకు తోడు రవి బిష్ణోయ్ (2/11)కూడా రాణించడంతో జింబాబ్వే 134 పరుగులకే చాప చుట్టేసింది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. సిరీస్‌ను డ్రా చేసిన టీమిండియా.. ఇదే ఊపులో నెక్స్ట్ మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టాలని చూస్తోంది. లోకల్ కండీషన్స్‌కు త్వరగా అలవాటు పడిన గిల్ సేన.. ఇప్పుడు రండి చూస్కుందాం అంటూ జింబాబ్వేకు సవాల్ విసురుతోంది. రెండో మ్యాచ్‌లోలాగే మూడో టీ20లోనూ చిత్తు చేస్తామని వార్నింగ్ ఇస్తోంది. ఈ తరుణంలో భారత్‌కు మరో గుడ్ న్యూస్. మన టీమ్‌లోకి ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు. సంజూ శాంసన్‌తో పాటు యశస్వి జైస్వాల్, శివమ్ దూబె తాజాగా జట్టుతో చేరారు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన స్క్వాడ్‌లో సభ్యులుగా ఉన్న సంజూ, జైస్వాల్, దూబె వెస్టిండీస్ నుంచి కాస్త ఆలస్యంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత్‌కు రాగానే ప్రధాని నరేంద్ర మోడీని కలవడం, ఆ తర్వాత ముంబైలో ఘనంగా నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో పాల్గొనడంతో వాళ్లు ఫుల్ బిజీ అయిపోయారు. విక్టరీ పరేడ్ తర్వాత సంజూ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే దూబె, జైస్వాల్ మాత్రం మహారాష్ట్ర అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి సహా ఇతర నేతల్ని కలిశారు. అక్కడి విధాన సభలో ప్రసంగించారు. ఇలా పలు కార్యక్రమాలను ముగించుకొని జింబాబ్వేకు పయనమయ్యారు. తాజాగా టీమ్‌తో జాయిన అయిన వీళ్లు.. మూడో టీ20కి అందుబాటులో ఉంటారు. దీంతో కీలక మ్యాచ్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వీళ్ల రాకతో జట్టులో ఎవరి ప్లేస్‌కు గండం ఏర్పడుతుందో చూడాలి. జైస్వాల్, దూబె, సంజూ టీమ్‌లోకి వస్తే జింబాబ్వేకు దబిడిదిబిడేనని చెప్పాలి.
Sanju Samson, Yashasvi Jaiswal & Shivam Dube have joined the Indian team for Zimbabwe series. [RevSportz] pic.twitter.com/zAp8zlMYcD
— Johns. (@CricCrazyJohns) July 8, 2024