IND vs ZIM: జింబాబ్వే సిరీస్​కు టీమిండియా రెడీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

టీ20 వరల్డ్ కప్ హడావుడి ఇంకా ముగియలేదు. అంతలోనే మరో ఇంట్రెస్టింగ్ సిరీస్​కు రెడీ అయిపోయింది భారత జట్టు. జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్​లో ఆడనుంది యంగ్ ఇండియా.

టీ20 వరల్డ్ కప్ హడావుడి ఇంకా ముగియలేదు. అంతలోనే మరో ఇంట్రెస్టింగ్ సిరీస్​కు రెడీ అయిపోయింది భారత జట్టు. జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్​లో ఆడనుంది యంగ్ ఇండియా.

టీ20 వరల్డ్ కప్ విజయాన్ని మొత్తం భారతావని ఎంజాయ్ చేస్తోంది. ఇంకా గెలుపు సంబురాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ముంబైలో రోహిత్ సేన ప్రపంచ కప్ ట్రోఫీతో తెగ సందడి చేసింది. ఎయిర్​పోర్ట్​లో దిగిన వెంటనే టీమిండియాకు అభిమానులు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు. భారత క్రికెటర్లను చూసేందుకు లక్షలాది మంది ముంబై నగరానికి తరలివచ్చారు. దీంతో అక్కడి వీధులు, రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. ఎయిర్​పోర్ట్ నుంచి విక్టరీ పరేడ్ నిర్వహిస్తూ వాంఖడే స్టేడియానికి చేరుకుంది భారత జట్టు. అక్కడ సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఆటగాళ్లు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఇలా వరల్డ్ కప్ హడావుడి కంటిన్యూ అవుతున్న టైమ్​లోనే మరో కీలక సిరీస్​కు సిద్ధమైపోయింది మెన్ ఇన్ బ్లూ. జింబాబ్వే టీమ్​తో 5 టీ20లు ఆడేందుకు యంగ్ ఇండియా రెడీ అయిపోయింది.

భారత్-జింబాబ్వే మధ్య హరారే స్పోర్ట్స్ క్లబ్​లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జింబాబ్వే టూర్​కు పూర్తి యువకులతో నిండిన టీమ్​ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. నెక్స్ట్ వరల్డ్ కప్​ను దృష్టిలో ఉంచుకొని ఈ పని చేశారు. ఈ టీమ్​కు యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. బ్యాటింగ్ భారాన్ని గిల్​తో పాటు రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్ మోయనున్నారు. ఆల్​రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్​తో పాటు అభిషేక్ శర్మ కూడా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు ఓపెనర్​గా ఆడే అవకాశాల్ని కొట్టిపారేయలేం. వికెట్ కీపింగ్ బాధ్యతల్ని జితేష్ శర్మ చూసుకుంటాడు.

తొలి టీ20లో భారత పేస్ దళాన్ని అవేశ్ ఖాన్ లీడ్ చేయనున్నాడు. అతడికి తోడుగా ముకేష్ కుమార్, హర్షిత్ రాణా టీమ్​లో ఉండటం ఖాయం. ఒకవేళ లెఫ్టార్మ్ పేసర్ కావాలనుకుంటే హర్షిత్​కు బదులుగా ఖలీల్ అహ్మద్​ను తీసుకోవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్​గా రవి బిష్ణోయ్​ ఆడటం పక్కా అని చెప్పొచ్చు. ఓవరాల్​గా టీమ్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. బిష్ణోయ్ కూడా బ్యాట్ ఊపగలడు కాబట్టి డెప్త్ ఉంది. బౌలింగ్​లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో పాటు అభిషేక్ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అవసరమైతే రియాన్ పరాగ్ కూడా చేతిని తిప్పుతాడు. అయితే అటు జింబాబ్వే టీమ్ ​కూడా పటిష్టంగా కనిపిస్తోంది. సికిందర్ రజా లాంటి డేంజరస్ ప్లేయర్ ఉన్న ఆ టీమ్​ను తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి.. భారత ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకెవరైనా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా):
శుబ్​మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా/ఖలీల్ అహ్మద్.

Show comments