Rinku Singh Gets No Support From Gambhir: రింకూపై గంభీర్ పగబట్టాడా? ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు?

Rinku-Gambhir: రింకూపై గంభీర్ పగబట్టాడా? ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు?

India vs Sri Lanka: శ్రీలంక సిరీస్​ను టీమిండియా గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. శనివారం జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించి సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

India vs Sri Lanka: శ్రీలంక సిరీస్​ను టీమిండియా గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. శనివారం జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించి సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

శ్రీలంక సిరీస్​ను టీమిండియా గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. శనివారం జరిగిన తొలి టీ20లో ఘనవిజయం సాధించి సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​తో భారత్​కు చాలా సానుకూల అంశాలు లభించాయి. బ్యాటింగ్​లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40), శుబ్​మన్ గిల్ (16 బంతుల్లో 34) దుమ్మురేపారు. ఫస్ట్​ డౌన్​లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 58) కీలక ఇన్నింగ్స్​తో టీమ్​కు భారీ స్కోరు అందించాడు. కీపర్ రిషబ్ పంత్ (33 బంతుల్లో 49) యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖరి వరకు క్రీజులో నిలబడటం మరో పాజిటివ్ అంశం. బౌలింగ్​లో అర్ష్​దీప్ సింగ్, అక్షర్ పటేల్​తో పాటు రియాన్ పరాగ్ మ్యాజిక్ స్పెల్​తో లంకను కూల్చి మన బౌలింగ్​కు ఢోకా లేదని నిరూపించారు.

ఇలా ఒక్క మ్యాచ్​తో భారత్ చాలా సానుకూల అంశాలను సాధించింది. అయితే ఇప్పుడు టీమిండియా ఘనవిజయం కంటే మరో రెండు విషయాలు హైలైట్ అవుతున్నాయి. అందులో ఒకటి టీమ్​లో ఉన్న ప్లేయర్ రింకూ సింగ్ గురించి, మరొకటి బెంచ్ మీద ఉన్న ఆటగాడు సంజూ శాంసన్ గురించి కావడం గమనార్హం. సంజూ​ను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ అతడికి సపోర్ట్​గా మాట్లాడుతూ వచ్చిన గంభీర్.. తీరా కోచ్ అయ్యాక అతడికి హ్యాండ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. అదే టైమ్​లో రింకూ విషయంలో వ్యవహరించిన తీరుతోనూ గౌతీ ట్రోలింగ్​కు గురయ్యాడు. ఎంతో టాలెంట్ ఉన్న రింకూకు గంభీర్ అన్యాయం చేస్తున్నాడని.. అతడి మీద పగబట్టాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సీజన్​ ఐపీఎల్​లో కేకేఆర్ ఫ్రాంచైజీకి మెంటార్​గా వచ్చిన గంభీర్​ అందరు ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. దీని వల్లే టీమ్ కప్పును ఎగరేసుకుపోయిది. అందరి విషయంలో ఒకలా వ్యవహరించిన గౌతీ.. రింకూతో ప్రవర్తించిన తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. ఆ టోర్నీలో రింకూకు సరైన ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. దీని వల్ల అతడికి టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​లో ప్లేస్ మిస్ అయింది. రిజర్వ్ ప్లేయర్​గా మెగాటోర్నీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు లంకతో సిరీస్​లో తొలి మ్యాచ్​లో రైటాండ్-లెఫ్టాండ్ కాంబినేషన్ ఉండాలనే కారణంతో రింకూను బ్యాటింగ్​కు వెళ్లకుండా ఆపాడు గౌతీ. అతడి కంటే ముందు రియాన్ పరాగ్​ను పంపాడు.

ఆఖర్లో బ్యాటింగ్​కు దిగిన రింకూకు కేవలం 1 బంతి ఆడే ఛాన్స్ దొరికింది. దీంతో గంభీర్​పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. రింకూ లాంటి పించ్​ హిట్టర్​ను ముందు పంపకుండా.. రైట్-లెఫ్ట్ కాంబో అంటూ టైమ్ వేస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పరాగ్ పొడిచిందేమీ లేదని.. అతడి కోసం రింకూను బలి చేయొద్దని సీరియస్ అవుతున్నారు. ఇలాగే అవకాశాలు ఇవ్వకుండా ఆపితే రింకూ కాన్ఫిడెన్స్ దెబ్బతిని.. అతడి కెరీర్ మరింత డేంజర్​లో పడటం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. అతడి కెరీర్​తో ఆడుకోవద్దని అంటున్నారు. మరి.. రింకూ విషయంలో గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments