ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ లో 27 రికార్డులు బద్దలు.. అవేంటంటే?

  • Author Soma Sekhar Published - 01:20 PM, Thu - 16 November 23

ప్రపంచ కప్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలైయ్యాయి. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో ఏకంగా 27 రికార్డులు నమోదు అయ్యాయి.

ప్రపంచ కప్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలైయ్యాయి. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో ఏకంగా 27 రికార్డులు నమోదు అయ్యాయి.

  • Author Soma Sekhar Published - 01:20 PM, Thu - 16 November 23

ప్రపంచ కప్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలైయ్యాయి. వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం(నవంబర్ 15) వాంఖడే స్టేడియంలో ఇండియా-కివీస్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు 70 రన్స్ తో న్యూజిలాండ్ ను చిత్తుచేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ అవ్వడంతో పాటుగా క్రియేట్ అయ్యాయి. ఒకే ఒక్క మ్యాచ్ లో ఏకంగా 27 రికార్డులు నమోదు అయ్యాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే..

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లో నమోదైన రికార్డులు:

  • సచిన్ టెండుల్కర్ సాధించిన 49 సెంచరీల రికార్డును తిరగరాశాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో 50వ శతకం సాధించి ఈ ఘనతకెక్కాడు.
  • ఇకే ఇదే సమయంలో సచిన్ ఒకే వరల్డ్ కప్ లో సాధించిన 673 రన్స్ ను అధిగమించాడు కోహ్లీ. ఈ మెగాటోర్నీలో 711 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ.
  • దీనితో పాటుగా ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో 700కు పైగా స్కోర్ సాధించిన ఏకైక బ్యాటర్ గా విరాట్ ఘనతకెక్కాడు.
  • విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో 8 అర్ధశతకాలు సాధించి.. సచిన్(7)ను అధిగమించాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
  • వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో ప్లేస్ లోకి దూసుకొచ్చాడు విరాట్. ఈ మ్యాచ్ ద్వారా పాంటింగ్(13,704) ను వెనక్కి నెట్టాడు. విరాట్ 291 ఇన్నింగ్స్ ల్లో 13,794 రన్స్ చేశాడు.
  • విరాట్ కోహ్లీ ఒకే క్యాలెండర్ ఇయర్ లో 6 సెంచరీలు సాధించాడు. 2017, 2018లో కూడా విరాట్ ఈ ఫీట్ క్రియేట్ చేశాడు.
  • ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో మూడు సెంచరీలు సాధించిన తొమ్మిదో బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు కింగ్ విరాట్.
  • వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా మహ్మద్ షమీ నయా రికార్డు సృష్టించాడు.
  • షమీ తన కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలను (57/7) నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో స్టువర్ట్ బిన్నీ రికార్డు బద్దలు కొట్టాడు.
  • వరల్డ్ కప్ హిస్టరీలోనే 4 సార్లు 5 వికెట్లు పడగొట్టి 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రను తిరగరాశాడు.
  • ఈ క్రమంలోనే జహీర్ ఖాన్ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్ లో తీసిన 21 వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు. అదీకాక నాకౌట్ మ్యాచ్ ల్లో 5 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు షమీ.
  • టీమిండియా వరుసగా 10 వన్డేలు గెలవడం చరిత్రలో ఇదే మెుదటిసారి.
  • వరల్డ్ కప్ లో సింగిల్ ఎడిషన్ లో వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన తొలి ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ కొత్త చరిత్రను లిఖించాడు.
  • టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్లిన 4వ సారథిగా రోహిత్ నిలిచాడు. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ధోని తర్వాత నిలిచాడు హిట్ మ్యాన్.
  • వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్స్ లు కొట్టిన గేల్(49) రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్. హిట్ మ్యాన్ 27 మ్యాచ్ ల్లో 51 సిక్స్ లు బాదాడు.
  • ప్రపంచ కప్ హిస్టరీలో అత్యంత వేగంగా 1500 రన్స్ కొట్టిన బ్యాటర్ గా నిలిచాడు రోహిత్.
  • ప్రపంచ కప్ లో ఒకే మ్యాచ్ లో ఎక్కువ సిక్స్ లు(8) కొట్టిన బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్ ఘనత సాధించాడు. రోహిత్, ద్రవిడ్ తర్వాత వరుసగా సెంచరీలు సాధించిన బ్యాటర్ గానూ అయ్యర్ రికార్డు నెలకొల్పాడు.
  • డార్లీ మిచెల్ రెండు సెంచరీలు సాధించి వరల్డ్ కప్ లో ఇండియాపై ఈ రికార్డు నెలకొల్పిన ఏకైక కివీస్ బ్యాటర్ గా నిలిచాడు.
  • టీమిండియా సాధించిన 397/4 స్కోర్ ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో ఏ టీమ్ పైన అయిన ఇదే అత్యధిక స్కోర్. మరి ఒకే ఒక్క మ్యాచ్ లో ఇన్ని రికార్డులు నమోదు అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Show comments