కెన్యా కోచ్​గా భారత దిగ్గజం.. ఇక, ఆ టీమ్ తలరాత మారడం ఖాయం!

Dodda Ganesh: ఒకప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్​లో సంచలనం సృష్టించింది కెన్యా జట్టు. కానీ అదే పెర్ఫార్మెన్స్​ను కంటిన్యూ చేయడంలో విఫలమైంది. అలాంటి టీమ్​ తలరాత మార్చేందుకు ఓ టీమిండియా లెజెండ్ సిద్ధమవుతున్నాడు.

Dodda Ganesh: ఒకప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్​లో సంచలనం సృష్టించింది కెన్యా జట్టు. కానీ అదే పెర్ఫార్మెన్స్​ను కంటిన్యూ చేయడంలో విఫలమైంది. అలాంటి టీమ్​ తలరాత మార్చేందుకు ఓ టీమిండియా లెజెండ్ సిద్ధమవుతున్నాడు.

ఒకప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్​లో సంచలనం సృష్టించింది కెన్యా జట్టు. వన్డే వరల్డ్ కప్-2003లో ఏకంగా సెమీస్​కు చేరుకుందా టీమ్. పసికూన కదా అని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ చెలరేగి ఆడిన ఆ జట్టు కెనడా, బంగ్లాదేశ్​, శ్రీలంకను చిత్తు చేసి సెమీఫైనల్ చేరుకుంది. భారత్​తో జరిగిన నాకౌట్ ఫైట్​లో ఓడిపోయినా పోరాడి అందరి హృదయాలు గెలుచుకుంది. అదే ఆ టీమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. కానీ అదే ఆటతీరును కంటిన్యూ చేయడంలో విఫలమైంది. ఏటికేడు ఆ టీమ్ పెర్ఫార్మెన్స్ పడిపోతూ వస్తోంది. అలాంటి టీమ్​ తలరాత మార్చేందుకు ఓ టీమిండియా లెజెండ్ సిద్ధమవుతున్నాడు. కెన్యా జట్టుకు హెడ్​ కోచ్​గా ఓ భారత మాజీ ఆటగాడు వస్తున్నాడు. దీంతో ఆ టీమ్ తలరాత మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కెన్యా టీమ్ హెడ్​ కోచ్​గా టీమిండియా మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ నియమితుడయ్యాడు. ఇందుకు సంబంధించి కెన్యా క్రికెట్ బోర్డు బుధవారం అధికారిక ప్రకటన చేసింది. త్వరలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026 క్వాలిఫయర్స్ ఉండటంతో కొత్త కోచ్​ను నియమించామని తెలిపింది. కోచ్​గా ఎంపికవడంపై దొడ్డ గణేశ్ రియాక్ట్ అయ్యాడు. కెన్యా టీమ్​ను వరల్డ్ కప్ పోటీలో నిలపడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నాడు. కెన్యా క్రికెట్​లో గతంలో ఏం జరిగిందనే విషయంతో తనకు సంబంధం లేదన్నాడు. ప్రస్తుత టీమ్​లో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేదని.. వాళ్లను సానబెట్టాల్సి ఉందన్నాడు దొడ్డ గణేశ్.

కెన్యా టీమ్​లో సూపర్బ్ ప్లేయర్స్ ఉన్నారని.. వాళ్లతో కలసి వర్క్ చేయనుండటం సంతోషంగా ఉందన్నాడు దొడ్డ గణేశ్. ఇక, కర్ణాటకకు చెందిన ఈ పేస్ ఆల్​రౌండర్.. 1997లో టీమిండియా తరఫున డెబ్యూ మ్యాచ్ ఆడాడు. అయితే అదే ఏడాది ఆయన తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటం గమనార్హం. మొత్తంగా భారత జట్టు తరఫున టెస్టుల్లో ఐదు వికెట్లు, వన్డేలో ఒక వికెట్ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్​లో అంతంత మాత్రంగానే ఆడిన దొడ్డ గణేశ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో మాత్రం దిగ్గజంగా పేరు తెచ్చుకున్నాడు. 193 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో కలిపి ఏకంగా 493 వికెట్లు తీశాడు. అలాగే 2,548 రన్స్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్​పై పట్టు, సుదీర్ఘ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న దొడ్డ గణేశ్ తలచుకుంటే కెన్యా పొట్టి ప్రపంచ కప్​కు అర్హత సాధిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. ఆయన పట్టుదలతో టీమ్​ను నడిపిస్తే పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు.

Show comments