పంతం నెగ్గించుకున్న BCCI.. భారత్​తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్​కు చూపించింది!

భారత్​తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోమారు పాకిస్థాన్​కు తెలిసొచ్చింది. మనతో సరిహద్దుల్లోనే కాదు.. క్రికెటింగ్ విషయాల్లోనూ కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాదికి బీసీసీఐ బాగా బుద్ధి చెప్పింది.

భారత్​తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోమారు పాకిస్థాన్​కు తెలిసొచ్చింది. మనతో సరిహద్దుల్లోనే కాదు.. క్రికెటింగ్ విషయాల్లోనూ కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాదికి బీసీసీఐ బాగా బుద్ధి చెప్పింది.

సరిహద్దుల్లోనే కాదు.. క్రికెటింగ్ వ్యవహారాల్లోనూ భారత్​ను పాకిస్థాన్ ఇబ్బంది పెడుతుందనేది తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఇలాగే భారత క్రికెట్​ బోర్డును రెచ్చగొడుతూ వస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే ఆ దేశంతో సరిహద్దు, రక్షణ-దౌత్య పరమైన సమస్యలు ఉన్న కారణంగా అక్కడికి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. భద్రత లేని చోట ఆటగాళ్లను పంపబోమని కరాఖండీగా చెబుతోంది. అయితే పాక్ మాత్రం భారత జట్టు తమ దేశానికి వచ్చి తీరాల్సిందేనని మొండిపట్టు పడుతోంది. టీమిండియా రాకపోతే ఆ జట్టును బ్యాన్ చేసి ఇంకో టీమ్​ను తమ దేశానికి పంపాలంటూ ఐసీసీకి చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

పాక్ మాజీ ఆటగాళ్లు టీమిండియాను బ్యాన్ చేసి ఇంకో జట్టును సెలెక్ట్ చేయమని చెప్పడంతో బీసీసీఐ ఈ అంశాన్ని మరింత సీరియస్​గా తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తాము ఆడాల్సిన మ్యాచులను హైబ్రిబ్ మోడల్​లో శ్రీలంక లేదా దుబాయ్ లాంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని భారత బోర్డు పట్టుబట్టింది. పాకిస్థాన్​కు మాత్రం టీమిండియాను పంపబోమని బీసీసీఐ భీష్మించుకోవడంతో ఐసీసీ దిగి రాక తప్పలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు భారత్​కు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ టోర్నమెంట్ కోసం 65 మిలియన్ డాలర్ల (రూ.544 కోట్లు)ను కేటాయించాలని ఏజీఎం మీటింగ్​లో ఐసీసీ డిసైడ్ అయిందని సమాచారం.

పాకిస్థాన్​లో జరగాల్సిన మ్యాచులతో పాటు తటస్థ వేదికల్లో భారత్ ఆడే మ్యాచుల నిర్వహణకు కూడా సరిపోయేలా ఐసీసీ బడ్జెట్​ను కేటాయించిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంకొన్నాళ్లు బీసీసీఐ ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుందట ఐసీసీ. ఒకవేళ అప్పటికి కూడా పాక్​కు వెళ్లమని బోర్డు మొండికేస్తే భారత మ్యాచుల్ని తటస్థ వేదికల్లో నిర్వహిస్తారట. అందుకే ముందు జాగ్రత్తగా భారీ బడ్జెట్​ను కేటాయించారని తెలుస్తోంది. ఇది తెలిసిన టీమిండియా ఫ్యాన్స్.. భారత్​తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఇదంతా బీసీసీఐ ఆడిన ఆట అని.. మన ముందు పాక్​ జూజూబీ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ బడ్జెట్ అలోకేషన్, వెన్యూస్​ విషయంలో ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం.

Show comments