టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌కు ఇచ్చే శాలరీ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు!

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌కు ఇచ్చే శాలరీ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు!

Gautam Gambhir, Head Coach, Salary: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడు అంతా గౌతమ్ గంభీర్ జీతం గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియామకం ఖరారు అయిపోయింది. ఇప్పటికే బీసీసీఐ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటన కూడా చేసింది. గౌతమ్ గంభీర్ పిక్ షేర్ చేస్తూ.. హెడ్ కోచ్ అంటూ పోస్ట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో గంభీర్‌ చెప్పిన సమాధానాలకు సీఏసీ సభ్యులు స్యాటిస్‌ఫై అయినట్లు వార్తలు వచ్చాయి. గంభీర్ హెడ్ కోచ్ కాబోతున్నాడు అంటూ మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా ఛార్జ్‌ తీసుకోనున్నాడు.

అయితే.. టీమిండియా హెడ్‌ కోచ్‌ అంటే చిన్న పొజిషన్‌ కాదు.. ఎంతో బరువు బాధ్యతలు ఉంటాయి. పైగా ఎంతో పవర్‌ ఫుల్‌ పొజిషన్‌. టీమిండియా శాసించే స్థాయిలో ఉండే హెడ్‌ కోచ్‌కు జీతం కూడా భారీగానే ఉంటుంది. ప్రస్తుత హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు ఏడాదికి 12 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అది కూడా 2021 నుంచి 2023 టైమ్‌ పరియడ్‌లో. ఆ తర్వాత ద్రవిడ్‌ పదవీ కాలం పొడిగించడంతో.. అదనంగా మరో 6 నుంచి 7 కోట్లు వేతనంగా పొందినట్లు రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి.

ఇప్పుడు గంభీర్‌కు అంతకంటే ఎక్కువే ఇచ్చేలా ఉన్నారు. ద్రవిడ్‌కి ఇచ్చిన ఏడాది ప్యాకేజీ ప్రకారం నెలకు రూ.కోటి ఇచ్చినట్లు లెక్క. ఇప్పుడ కొత్త కోచ్‌గా వస్తున్న గంభీర్‌ కు.. ఏడాదికి 15 నుంచి 25 కోట్ల మధ్య జీతం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు గంభీరే టీమిండియకు కోచ్‌గా ఉండనుండటంతో(ఒప్పందం ప్రకారం) మొత్తంగా టీమిండియా హెడ్‌ కోచ్‌గా 50 నుంచి 60 కోట్ల రూపాయలు గంభీర్‌ జీతంగా అందుకోనున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డుగా ఉన్న బీసీసీఐ.. తమ హెడ్‌ కోచ్‌కు ఆ మాత్రం జీతం ఇవ్వడంలో తప్పులేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి హెడ్‌ కోచ్‌ జీతభత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments