Gautam Gambhir: వాళ్లతో కావాలనే గొడవ పడ్డా.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Gautam Gambhir, Virat Kohli: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కెరీర్ ఆరంభం నుంచి కాస్త దూకుడుగానే ఉంటున్నాడు. విరాట్ కోహ్లీ సహా పలువురు ప్లేయర్లతో అతడు గొడవకు దిగిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం.

Gautam Gambhir, Virat Kohli: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కెరీర్ ఆరంభం నుంచి కాస్త దూకుడుగానే ఉంటున్నాడు. విరాట్ కోహ్లీ సహా పలువురు ప్లేయర్లతో అతడు గొడవకు దిగిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం.

క్రికెట్​లో ఒక్కో ప్లేయర్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు. కొందరు తమ పనేదో తాము అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. మరికొందరు కాస్త అగ్రెసివ్​గా ఉంటారు. ఇంకొందరు మాత్రం ఎవరి జోలికి వెళ్లరు. ఎవరైనా గెలికితే మాత్రం అస్సలు వదలరు. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇదే రకం. ప్లేయర్​గా భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి అతడు అలాగే ఉన్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ టైమ్​లో తాను ఏం చేయాలో అది చేసుకుంటూ పోతాడు గౌతీ. అయితే అపోజిషన్ టీమ్స్ నుంచి ఎవరైనా వచ్చి గెలికితే మాత్రం వాళ్లకు ఇచ్చిపడేస్తాడు. ఎవరైనా స్లెడ్జ్ చేసినా, బూతులు తిట్టినా, బాహాబాహీకి దిగినా వాళ్లతో ఢీ అంటే ఢీ అంటాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఐపీఎల్​లో పలు సందర్భాల్లో గొడవకు దిగాడు గౌతీ. ఇంత అగ్రెషన్, గొడవలకు వెనుకాడకపోవడానికి సంబంధించి గంభీర్​కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

కోహ్లీతో కలసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు గంభీర్. ఇద్దరూ ఒకర్నొకరు క్రికెట్​ గురించి పలు ప్రశ్నలు అడుగుతూ, వాటికి సమాధానాలు చెబుతూ ఇంటర్వ్యూను ఆసక్తికరంగా మార్చేశారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ చేసే టైమ్​లో ఇతర జట్లతో జరిగిన గొడవల గురించి చెప్పమంటూ గౌతీని అడిగాడు కోహ్లీ. దీనికి అతడు స్పందిస్తూ.. తనకు గొడవలు అంటే ఇష్టమన్నాడు. కొన్నిసార్లు కావాలనే అపోజిషన్ టీమ్స్​తో ఫైట్స్ చేశానన్నాడు. మరింత రెచ్చిపోయి ఆడేందుకు, తన బెస్ట్​ను బయటకు తీసేందుకు ఇది తనకు ఉపయోగపడిందన్నాడు. అయినా తన కంటే కోహ్లీకే ఈ ప్రశ్నకు ఆన్సర్ బాగా తెలుసంటూ జోక్ చేశాడు గౌతీ. ఎవరైనా గెలికితే అస్సలు తగ్గనని.. అది తన పర్సనాలిటీ అని చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు ప్రత్యర్థులు ఏమైనా అన్నా లైట్ తీసుకునేవాడ్ని అని.. కానీ ఇంకొన్ని సార్లు మాత్రం వాళ్లను వదల్లేదన్నాడు.

బ్యాటింగ్ టైమ్​లో ప్రత్యర్థులతో గొడవల వల్ల తాను చేసే పని మీద మరింత ఫోకస్ పెట్టగలిగానన్నాడు గంభీర్. కెరీర్​లో ఎలాంటి రిగ్రెట్స్ ఉండకూడదని తాను భావించానన్నాడు. అందుకే ఎవరైనా తనతో గొడవకు దిగితే ఊరుకోలేదన్నాడు. దీని వల్ల తనకు జరిగిన నష్టమేమీ లేదని.. కసితో బ్యాటింగ్ చేసేందుకు, పరుగుల వరద పారించేందుకు, మ్యాచ్​లు గెలిచేందుకు ఇలాంటి ఘటనలు తనకు చాలా హెల్ప్ అయ్యాయని పేర్కొన్నాడు గౌతీ. ఇదే ఇంటర్వ్యూలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు అద్భుతమైన వ్యక్తి అని.. డ్రెస్సింగ్ రూమ్​లో అతడికి అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారన్నాడు. కెరీర్ మొదట్నుంచి ఇప్పటివరకు హిట్​మ్యాన్​తో తనకు ఉన్న అనుబంధం ఇంకా చెక్కుచెదరలేదన్నాడు గంభీర్.

Show comments