భారత హెడ్‌ కోచ్‌గా అతనే కరెక్ట్‌! మనసులో మాట బయటపెట్టిన గంగూలీ

Gautam Gambhir, Head Coach, Sourav Ganguly: టీమిండియా హెడ్‌ కోచ్‌గా అతనే సరైన వ్యక్తి అంటూ టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఒక పేరును సూచించారు. మరి ఆ వ్యక్తి ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, Head Coach, Sourav Ganguly: టీమిండియా హెడ్‌ కోచ్‌గా అతనే సరైన వ్యక్తి అంటూ టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఒక పేరును సూచించారు. మరి ఆ వ్యక్తి ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2024తో బిజీగా ఉన్నా.. మరో వైపు టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎవరు ఉండాలనే విషయంపై కూడా క్రికెట్‌ అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెడ్‌ కోచ్‌ కోసం బీసీసీఐ సూచించిన దరఖాస్తు గడువు కూడా పూర్తి కావడంతో.. ఫలాన వ్యక్తి టీమిండియా కోచ్‌గా వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్‌ కోచ్‌గా, భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఫిక్స్‌ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, బీసీసీఐ మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ ఛైర్మన్‌ అయిన సౌరవ్‌ గంగూలీ తాజాగా హెడ్‌ కోచ్‌గా ఎవరైతే కరెక్ట్‌ అనే విషయంపై స్పందించాడు.

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ సరైన వ్యక్తి అని దాదా తన మనసులో మాట బయటపెట్టాడు. దాదా మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్‌కు ఆట పట్ల మంచి ప్యాషన్‌తో ఉంటాడు. అలాగే మంచి హానెస్ట్‌ పర్సన్‌ అంటూ పేర్కొన్నాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌గా అతనే సరైన వ్యక్తి అంటూ మద్దతు ఇచ్చాడు. అయితే.. ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ ముగిసిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి జైషా.. గంభీర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపాడు. కేకేఆర్‌ ఐపీఎల్‌ 2024 ఛాంపియన్‌గా నిలవడంలో గంభీర్‌ పాత్ర చాలా ఉంది. అందుకే గంభీర్‌ను హెడ్‌ కోచ్‌ పదవి కోసం జైషా సంప్రదించినట్లు తెలుస్తోంది.

తాజాగా గౌతమ్‌ గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఫైనల్‌ అయిపోయినట్లు.. నేడో రేపో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు కూడా వార్తలు బలంగా వస్తున్నాయి. నేషనల్‌ మీడియాలో కూడా రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి అంటూ.. కథనాలు వెలువరిస్తున్నాయి. ఈ క్రమంలోనే గంగూలీ సైతం గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా సరైనోడు అంటూ కితాబివ్వడంతో గంభీరే హెడ్‌ కోచ్‌గా ఫిక్స్‌ అని క్రికెట్‌ అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి భారత హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ సరైనోడు అని దాదా అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments