Gautam Gambhir Equation With Rohit And Kohli: రోహిత్-కోహ్లీని చూసి ఎందుకు భయపడాలి? గంభీర్​పై భారత క్రికెటర్ కామెంట్స్!

Rohit-Kohli: రోహిత్-కోహ్లీని చూసి ఎందుకు భయపడాలి? గంభీర్​పై భారత క్రికెటర్ కామెంట్స్!

టీమిండియా కొత్త కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్ అందరు ఆటగాళ్లతో బాగా కలసిపోయాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కూడా చర్చలు జరుపుతూ, నవ్వుతూ కనిపిస్తున్నాడు గౌతీ.

టీమిండియా కొత్త కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్ అందరు ఆటగాళ్లతో బాగా కలసిపోయాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కూడా చర్చలు జరుపుతూ, నవ్వుతూ కనిపిస్తున్నాడు గౌతీ.

టీమిండియా కొత్త కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్ అందరు ఆటగాళ్లతో బాగా కలసిపోయాడు. శ్రీలంక టూర్​తో కోచ్​గా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌతీ ఆకట్టుకుంటున్నాడు. ప్లేయర్లతో కలసిపోవడమే గాక టీమ్ గెలుపు కోసం అవసరమైన వ్యూహాలు పన్నుతూ తన మార్క్ చూపిస్తున్నాడు. టీ20 సిరీస్​లో యంగ్​స్టర్స్​తో బాగా జెల్ అయిపోయిన గౌతీ.. వన్డే సిరీస్​ కోసం వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లతోనూ కలసిపోయాడు. గంభీర్​కు పొగరు అతడు టీమ్​లో ఇమడలేడు, ముఖ్యంగా కోహ్లీకి అతడికి పొసగదంటూ వచ్చిన విమర్శలకు గౌతీ తన బిహేవియర్​తోనే కౌంటర్ ఇస్తున్నాడు. నెట్ సెషన్స్​లో కోహ్లీ, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లతో దగ్గర ఉండి ప్రాక్టీస్ చేయిస్తున్నాడు.

సీనియర్ ఆటగాళ్లతో జట్టు కూర్పు గురించి చర్చిస్తూ, సరదాగా జోక్స్ కూడా వేస్తూ గంభీర్ నవ్వుల్లో మునిగిపోవడం చూస్తున్నాం. దీన్ని చూసిన ఫ్యాన్స్ అతడు ఇంత జోవియల్​గా ఉంటాడని అనుకోలేదని అంటున్నారు. అయితే గౌతీ తీరుపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా మాత్రం సీరియస్ అవుతున్నాడు. రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్లను చూసి భయడాల్సిన అవసరం ఏం ఉందని ఇన్​డైరెక్ట్​గా చురకలు అంటిస్తున్నాడు. నెహ్రా ఇలా కామెంట్ చేయడానికి ఓ కారణం ఉంది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్​కు రోహిత్, కోహ్లీ, బుమ్రాకు రెస్ట్ ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్, వరల్డ్ కప్ ఆడి అలసిపోయినందున వీళ్లకు విశ్రాంతి ఇస్తారని వినిపించింది. కానీ వన్డే సిరీస్​ కోసం సెలెక్ట్ చేయడంతో బుమ్రా మినహా మిగిలిన ఇద్దరు సీనియర్లు లంకకు వచ్చారు.

రోహిత్, కోహ్లీ వన్డే సిరీస్​లో ఆడేలా గంభీర్ ఒప్పించాడని వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఎక్కువ వన్డే మ్యాచులు లేకపోవడంతో సిరీస్​లో ఆడాల్సిందిగా కొత్త కోచ్ రిక్వెస్ట్ చేయడంతో రోకో జోడీ కాదనలేకపోయారని సమాచారం. దీని మీదే నెహ్రా తాజాగా రియాక్ట్ అయ్యాడు. ‘రోహిత్, కోహ్లీతో కొత్తగా కలవడానికి, వాళ్ల గురించి గంభీర్ తెలుసుకోవడానికి ఏమీ లేదు. అతడేమీ ఫారెన్ కోచ్ కాదు. బయటి దేశాల్లో ఆడేటప్పుడు ఆ ఇద్దర్నీ పక్కనబెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇవ్వాల్సింది. రోహిత్-కోహ్లీని హోమ్ సిరీస్​ల్లో ఆడిస్తే సరిపోయేది’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. మరి.. గంభీర్​పై నెహ్రా చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments