Nidhan
Gautam Gambhir, Virat Kohli, Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లీ ఆడిన ఓ ఇన్నింగ్స్ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
Gautam Gambhir, Virat Kohli, Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లీ ఆడిన ఓ ఇన్నింగ్స్ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు పూర్తిగా కలసిపోయారు. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తమ మధ్య కోచ్-ప్లేయర్ రిలేషన్ ఉన్నప్పటికీ.. మరోవైపు ఫ్రెండ్షిప్ను కూడా కాపాడుకుంటున్నారు. ఒకప్పుడు భారత్‌కు కలసి ఆడిన ఈ ఇద్దరు స్టార్లు.. ఐపీఎల్లో పలుమార్లు బాహాబాహీకి దిగారు. ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లడం లాంటివి జరిగాయి. అయితే గత సీజన్‌తో అన్నింటికీ చెక్ పెట్టిన కోహ్లీ-గౌతీ తిగిరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు టీమిండియాలో ఉండటంతో మరింత జోవియల్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ కలసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. క్రికెట్‌తో పాటు ఇతర విషయాల గురించి కూడా ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ మీద ప్రశంసలు కురిపించిన గంభీర్.. అతడు ఆడిన ఓ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఇన్నింగ్స్‌లు చూశానని.. కానీ అన్నింటి కంటే పాకిస్థాన్ మీద విరాట్ కోహ్లీ బాదిన 183 పరుగుల నాక్ గొప్పదన్నాడు గంభీర్. ఆసియా కప్‌లో 300 పైచిలుకు స్కోరును ఛేజ్ చేస్తూ విరాట్ బ్యాటింగ్ చేసిన తీరు, భారీ సెంచరీతో జట్టును గెలిపించిన విధానం భేష్ అని మెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్లో భారత బ్యాటర్ల నుంచి వచ్చిన అతిగొప్ప ఇన్నింగ్స్ అంటే అదేనని తెలిపాడు. అలాంటిది మళ్లీ చూడలేదన్నాడు గౌతీ. తన కెరీర్లో కోహ్లీ చాలా దూరం ప్రయాణించేశాడని, వచ్చే జనరేషన్ అతడి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నాడు. కోహ్లీ బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గానూ టీమిండియా మీద బలమైన ప్రభావం చూపించాడని మెచ్చుకున్నాడు గంభీర్. టెస్టుల్లో గెలవాలంటే 20 వికెట్లు తీయడం కంపల్సరీ అని గ్రహించి, బౌలర్లను ఎంకరేజ్ చేయడం, స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్‌ను బిల్డ్ చేయడం గొప్ప విషయమన్నాడు.
బౌలింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉండేలా చూసుకోవడం వల్లే టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ అంత సక్సెస్ సాధించాడని తెలిపాడు గంభీర్. అతడి యాటిట్యూడ్, అగ్రెషన్ టీమ్‌లో గెలవాలనే కసిని రగిలించిందన్నాడు. ఇదే యాటిట్యూడ్ ఓవర్సీస్లో విజయాలకు కారణమైందన్నాడు. టెస్టులకు కోహ్లీ ఇచ్చిన ఇంపార్టెన్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేనని.. వచ్చే తరం ఇలాగే లాంగ్ ఫార్మాట్‌ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు గౌతీ. విరాట్‌లో ఇంకా పరుగుల దాహం తీరలేదని, వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనే ఆకలి ఇంకా కొనసాగుతోందన్నాడు. ఇలాంటి ప్లేయర్లు జట్టులో ఉన్నందుకు ఇండియన్ క్రికెట్, ఫ్యాన్స్ గర్వపడాలంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు గంభీర్. ఏడాది ఆఖర్లో జరిగే ఆస్ట్రేలియా టూర్లో కోహ్లీ చెలరేగి ఆడతాడని ఆశిస్తున్నానని వివరించాడు. ఇక, గంభీర్‌కు అంతగా నచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ ఆసియా కప్-2012లో ఆడినది. పాక్ సంధించిన 329 పరుగుల ఛేదనలో కోహ్లీ (148 బంతుల్లో 183 రన్స్) భారీ సెంచరీతో వీరవిహారం చేయడంతో భారత్ అలవోకగా నెగ్గింది.
Gautam Gambhir to Virat Kohli:
“Your 183 against Pakistan in Asia Cup while chasing 300+ is the best ODI innings I’ve seen played by an Indian”. pic.twitter.com/pMq4Nqv02d
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2024