ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టిన KKR.. మూడుసార్లు ఒక్కడే హీరో!

Gautam Gambhir, IPL 2024, KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఫైనల్లో గెలిచి కేకేఆర్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టుకు ఇది మూడో కప్పు. ఈ మూడు కప్పుల్లోనూ హీరో అయింది మాత్రమే ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, IPL 2024, KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఫైనల్లో గెలిచి కేకేఆర్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టుకు ఇది మూడో కప్పు. ఈ మూడు కప్పుల్లోనూ హీరో అయింది మాత్రమే ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నిలిచింది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్‌ ఓడిపోయినా కూడా అద్భుతమైన బౌలింగ్‌తో ఎస​్‌ఆర్‌హెచ్‌ను కేవలం 113 పరుగులకే కుప్పకూల్చి.. వార్‌ వన్‌ సైడ్‌ చేసేసింది. మ్యాచ్‌ స్టార్టింగ్‌ నుంచి సన్‌రైజర్స్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్‌.. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఫైనల్‌ను గెలిచింది. గతంలో 2012, 2014 ఐపీఎల్‌ సీజన్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌.. ఇప్పుడు మళ్లి కప్పును కైవసం చేసుకుంది. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాత అధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన మూడో టీమ్‌గా కేకేఆర్‌ చరిత్ర సృష్టించింది. ఎంఐ, సీఎస్‌కే వద్ద ఐదేసి కప్పులు ఉంటే.. కేకేఆర్‌ మూడో కప్పును ఖాతాలో వేసుకుంది. అయితే.. కేకేఆర్‌ మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచానా.. హీరో మాత్రం ఒక్కటే అయ్యాడు. అతనెవరో? కేకేఆర్‌ కోసం ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

2008లో కేకేఆర్‌కు భారత దిగ్గజ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాతి ఏడాది బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, 2010లో మళ్లీ గంగూలీ కెప్టెన్లుగా వ్యవహరించారు. 2011 సీజన్‌లో కలిస్‌ ఓ రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేశాడు. అప్పటి వరకు కేకేఆర్‌ తలరాతలో ఎలాంటి మార్పులేదు. అప్పుడొచ్చాడు గౌతమ్‌ గంభీర్‌. 2011లో కేకేఆర్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిన గౌతీ.. 2012లో ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపి తొలి కప్పును అందించాడు. ఆ వెంటనే 2014లో కూడా కేకేఆర్‌ను విజేతగా నిలిచాడు. ఇలా గంభీర్‌ కెప్టెన్సీలో కేకేఆర్‌ ఒక తిరుగులేని జట్టుగా ఎదిగింది. మూడేళ్లలోనే ఏకంగా రెండు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ, ఆ తర్వాత మళ్లీ కపు​ కొట్టలేదు. 2017 ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత గంభీర్‌ కేకేఆర్‌ను వీడాడు.

గంభీర్‌ తర్వాత 2018 నుంచి 2020 వరకు కేకేఆర్‌ కెప్టెన్‌గా దినేష్‌ కార్తీక్‌ వ్యవహరించాడు. 2020 మధ్యలోనే డీకే తన కెప్టెన్సీని మోర్గాన్‌కు అప్పగించాడు. అతను ఐపీఎల్‌ 2021 తర్వాత వెళ్లిపోయాడు. మెర్గాన్‌ తర్వాత 2021 నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ కేకేఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2021, 2020 సీజన్స్‌లో కెప్టెన్సీ చేశాడు. గతేడాది అంటే 2023లో గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతని స్థానంలో నితీష్‌ రాణా కెప్టెన్సీ బాధ్యతలు అందున్నాడు. ఎన్ని మార్పులు చేసినా.. కేకేఆర్‌ మరో కప్పు కొట్టలేకపోయింది. ఇలా అయితే లాభం లేదని.. కేకేఆర్‌ కో-ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌ పాత యోధుడికి కబురు పెట్టాడు. కేకేఆర్‌ జట్టుకు మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు గౌతమ్‌ గంభీర్‌ను తిరిగి తీసుకొచ్చాడు.

కెప్టెన్‌గా 2012, 2014లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్‌కు.. ఈ సారి మెంటర్‌గా ఆ పని చేయాల్సిన బాధ్యతలు అప్పగించాడు కింగ్‌ ఖాన్‌. తనకు ఇచ్చిన బాధ్యతలను వందకు వంద శాతం పూర్తి చేసి చూపించాడు గంభీర్‌. మెంటర్‌గా వచ్చిన తొలి ఏడాదిలోనే కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీని, ప్లానింగ్‌ను అమలు చేసేవాడో.. ఇప్పుడు మెంటర్‌గా టీమ్‌ను డిక్టేట్‌ చేశాడు. అందులో భాగంగా సునీల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా దింపడం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. గత కొన్ని సీజన్లుగా కేకేఆర్‌ను పట్టిపీడిస్తున్న ఓపెనింగ్‌ సమస్యకు ఒక్క మూవ్‌తో చెక్‌ పెట్టేశాడు. గంభీర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. కేకేఆర్‌ను గెలిపించాలని కోరిన షారుఖ్‌ కోరిక తీస్తూ.. ముచ్చటగా మూడో సారి కేకేఆర్‌కు కప్పు అందించాడు జీజీ. మరి కేకేఆర్‌ సక్సెస్‌లో హీరోగా నిలిచిన గంభీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments