ఒకే ఓవర్లో విధ్వంసం.. వరుసగా 6,0,6,6,6,4

Liam livingstone: లివింగ్ స్టోన్ అధ్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ పై విరుచుకుపడ్డాడు. మిచెల్ స్టార్క్ కు చుక్కలు చూపించాడు. ఏకంగా ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అదరగొట్టాడు.

Liam livingstone: లివింగ్ స్టోన్ అధ్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ పై విరుచుకుపడ్డాడు. మిచెల్ స్టార్క్ కు చుక్కలు చూపించాడు. ఏకంగా ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అదరగొట్టాడు.

ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య 5 వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబర్ 27న నాలుగో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసిస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆసిస్ బౌలర్లకు చెమటలు పట్టించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు మెరుపు బ్యాటింగ్ తో విరుచుకుపడ్డారు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ సంచలనం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ మెరుపు బ్యాటింగ్‌తో 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయంగా 62 పరుగులు చేశాడు.

లివింగ్ స్టోన్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను చిత్తు చేశాడు. స్టార్క్ వేసిన ఓ ఓవర్లో 6,0,6,6,6,4 బాది రికార్డ్ సృష్టించాడు. స్టార్క్ పేరిట ఘోరమైన రికార్డ్ నమోదైంది. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఓవర్లో లివింగ్ స్టోన్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. దీంతో లివింగ్ స్టోన్ 27 బంతుల్లోనే 62 రన్స్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ 312 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ 126 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ఘన విజయం సాధించింది.

Show comments