Drona Desai: 18 ఏళ్ల కుర్రాడి ఊహకందని విధ్వంసం.. 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 రన్స్!

Drona Desai scored 498 Runs: 18 ఏళ్ల కుర్రాడు ఊహకందని విధ్వంసాన్ని సృష్టించాడు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రత్యర్థి బౌలర్లపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. ఏకంగా 498 పరుగులు బాదేశాడు.

Drona Desai scored 498 Runs: 18 ఏళ్ల కుర్రాడు ఊహకందని విధ్వంసాన్ని సృష్టించాడు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రత్యర్థి బౌలర్లపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. ఏకంగా 498 పరుగులు బాదేశాడు.

ప్రపంచ క్రికెట్ లో ఏదో ఒక మూల.. ఏదో ఒక మ్యాచ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు ప్లేయర్లు. ఇక కొన్నిసార్లు అయితే.. మనం నమ్మశక్యంలేని విధంగా చెలరేగిపోతుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఇన్నింగ్స్ కూడా ఇలాంటి నమ్మశక్యం కానిదే. నిండా 20 ఏళ్లు కూడా లేని ఓ కుర్రాడు వరల్డ్ క్రికెట్ షాక్ అయ్యే ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డబుల్, ట్రిపుల్ సెంచరీ కాదు.. ఏకంగా 498 రన్స్ చేసి కొద్దిలో 500 మార్క్ ను మిస్ అయ్యాడు. ఇదంతా చేసింది ఏ ఇంటర్నేషనల్ ప్లేయరో కాదు.. 18 ఏళ్ల ఓ స్కూల్ పిల్లాడు. అతడి పేరు ద్రోణ దేశాయ్. ఈ విధ్వంసాన్ని అండర్ 19 టోర్నమెంట్ లో సృష్టించాడు.

ద్రోణ దేశాయ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండియన్ క్రికెట్ లో మారుమోగిపోతోంది. దానికి కారణం అతడి మెరుపు ఇన్నింగ్సే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన దివాన్ బల్లు భాయ్ అండర్ 19 స్కూల్ టోర్నమెంట్ లో సెయింట్ జేవియర్ స్కూల్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు దేశాయ్. ఇక ఈ టోర్నీలో జేఎల్ ఇంగ్లీష్ స్కూల్ పై తన పంజా విసిరాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ చిచ్చరపిడుగు.. బౌలర్లను కనికరం లేకుండా ఊచకోతకోశాడు. ద్రోణ దేశాయ్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏం చేయలేకపోయారు. బౌలర్లను మార్చినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన ద్రోణ దేశాయ్ 320 బంతులు ఎదుర్కొని ఏకంగా 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 పరుగులు చేశాడు. కొద్దిలో 500 స్కోర్ ను మిస్ చేసుకున్నాడు.

ద్రోణ దేశాయ్ బ్లాస్టింగ్ బ్యాటింగ్ తో తొలి ఇన్నింగ్స్ జేవియర్ స్కూల్ ఏకంగా 844 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అయితే రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా కలిపి జేఎల్ ఇంగ్లీష్ టీమ్ ద్రోణ దేశాయ్ స్కోర్ ను దాటలేకపోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్ లో 40 రన్స్ కే కుప్పకూలిన ఆ టీమ్.. రెండో ఇన్నింగ్స్ లో 92 రన్స్ కే కుప్పకూలింది. దాంతో 712 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో జేవియర్ స్కూల్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం దేశాయ్ ఆడిన ఈ మారథాన్ ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 18 ఏళ్ల కుర్రాడు ఇలాంటి బ్యాటింగ్ తో చెలరేగడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. గతంలో ప్రణవ్ ధన్వాడే, పృథ్వీ షా, ఆర్మాన్ జాఫర్ లాంటి కొంత మంది మాత్రమే తమ స్కూల్ టోర్నీల్లో ఇలాంటి మారథాన్ ఇన్నింగ్స్ లు ఆడారు. మరి కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసానికి పరాకాష్ట అన్నట్లుగా చెలరేగి 498 పరుగులు చేసిన ఈ గుజరాత్ కుర్రాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments