SNP
Rohit Sharma, Pat Cummins, India, Australia, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ అండ్ టీమ్‌కు లభిస్తున్న ఆదరణ చూసి.. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఈ క్రమంలోనే ఇండియాకు ఆస్ట్రేలియాకు తేడా ఇదే అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Pat Cummins, India, Australia, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ అండ్ టీమ్‌కు లభిస్తున్న ఆదరణ చూసి.. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఈ క్రమంలోనే ఇండియాకు ఆస్ట్రేలియాకు తేడా ఇదే అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌ను రెండో సారి సాధించింది. 2007లో ధోని కెప్టెన్సీలో తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇన్నేళ్లకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. జూన్ 29న బార్బోడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత విజయంతో రోహిత్ సేన కప్పును కైవసం చేసుకుంది. అయితే.. ఫైనల్ తర్వాత వెస్టిండీస్ హరికేన్ తుపాను రావడంతో.. భారత ఆటగాళ్లు స్వదేశానికి రావడం కాస్త ఆలస్యం అయింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమిండియా ఆటగాళ్లు గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఈ రోజు(గురువారం) భారత జట్టు ఆటగాళ్లు ప్రత్యేకంగా రూపొందించిన ఛాంపియన్స్ జెర్సీలను ధరించి ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి.. ముంబైకి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ముంబైలో టీమిండియా ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్‌పై విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. దీని కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు ముంబై రోడ్లపైకి వచ్చేశారు. వీటన్నింటి కంటే ముందు.. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్‌తో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. అతనికి ఘన స్వాగతం లభించింది.
క్రికెట్‌ను ఒక మతంలా భావించే దేశంలో.. టీమిండియా వరల్డ్ కప్ గెలవడం అంటే.. చిన్న విషయం కాదు. పైగా వేరే దేశంలో కప్పు కొట్టి.. ఆ కప్పుతో జట్టు తిరిగి వస్తే.. క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పడతారు. 1983, 2007లో కూడా ఇలాంటి సీన్సే కనిపించాయి. తాజాగా రోహిత్‌కు కూడా అంతటి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఈ సీన్స్ చూసిన క్రికెట్ అభిమానులు.. ఇండియాకు ఆస్ట్రేలియాకు ఇదే తేడా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్తే కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు అక్కడి ప్రజలు. కమిన్స్ ఎయిర్‌లో దిగి వెళ్తున్న ఫొటోలు అప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోను ఇప్పుడు రోహిత్‌కు లభిస్తున్న ఆదరణను కంప్యార్ చేస్తూ.. క్రికెట్‌ను ఆడే దేశం ఒకటి, క్రికెట్‌ను ఆరాధించే దేశం ఒకటి అంటూ పేర్కొంటున్నారు. క్రికెట్ ఆడటం, గెలవడమే కాదు.. గెలుపును ఆస్వాదించడం కూడా తెలియాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Welcome home Team India 🇮🇳 #IndianCricketTeam pic.twitter.com/LSF0ZSBjLB
— Johns (@JohnyBravo183) July 4, 2024