Nidhan
పాకిస్థాన్ జట్టు మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆ టీమ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఒక్క రాంగ్ డెసిషన్ ఆ జట్టు కొంప ముంచింది.
పాకిస్థాన్ జట్టు మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆ టీమ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఒక్క రాంగ్ డెసిషన్ ఆ జట్టు కొంప ముంచింది.
Nidhan
ఒకప్పుడు డేంజరస్ టీమ్‌గా వరల్డ్ క్రికెట్లోని అన్ని టీమ్స్‌ను వణికించిన పాకిస్థాన్ ఈ మధ్య కాలంలో చెత్తాటతో పరువు తీసుకుంటోంది. పసికూన జట్ల కంటే హీనంగా ఆడుతూ సొంత దేశ అభిమానుల నుంచే విమర్శల్ని మూటగట్టుకుంటోంది. వన్డే వరల్డ్ కప్-2023, టీ20 ప్రపంచ కప్-2024లో గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించి ట్రోల్స్‌కు గురైన పాక్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌తోనైనా గాడిన పడుతుందేమోనని అంతా భావించారు. కానీ సొంతగడ్డపై ఆ టీమ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఒక్క రాంగ్ డెసిషన్‌తో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది దాయాది జట్టు. కెప్టెన్ షాన్ మసూద్, టీమ్ మేనేజ్మెంట్ కలసి తీసుకున్న ఓ నిర్ణయం ఆ టీమ్ కొంపముంచింది.
టెస్టుల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు నెగ్గాలంటే భారీ స్కోరు నమోదు చేయాలి. అపోజిషన్ టీమ్ బ్యాటింగ్‌కు దిగే ముందే కొండంత లక్ష్యాన్ని చూసి వణికిపోయేలా చేయాలి. కానీ పాకిస్థాన్ ఆ ఆపర్చునిటీని చేజేతులా మిస్ చేసుకుంది. బంగ్లాతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 448/6 వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది పాకిస్థాన్. మరో 100 నుంచి 150 పరుగులు చేసి డిక్లరేషన్ ఇచ్చి ఉంటే బంగ్లా డిఫెన్స్‌లో పడేది. పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంది. బాల్ పడి బ్యాట్ మీదకు ఈజీగా వస్తోంది. బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్లు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ టీమ్ ఉన్నా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసేది కాదు. కానీ పాక్ ఆ పని చేసి తన గొయ్యిని తానే తవ్వుకుంది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 565 పరుగులకు ఆలౌట్ అయింది.
ప్రెజర్‌లోకి నెట్టే ఛాన్స్‌ను పాక్ మిస్ చేసుకుంది. కానీ బంగ్లా బ్యాటర్లు మాత్రం దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. పట్టుదలతో ఆడుతూ టీమ్‌ను భారీ స్కోరుకు చేర్చారు. ఏకంగా 117 లీడింగ్ కూడా రావడంతో ఓడిపోని స్థితికి చేరుకుంది బంగ్లా. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లను మరింత అటాక్ చేస్తూ బౌలింగ్ చేశారు. ఇది వర్కౌట్ అయింది. పాక్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక్క స్పిన్నర్‌ను కూడా ఆడించకపోవడం, అవతలి జట్టులోని స్పిన్నర్లను సరిగ్గా ఫేస్ చేయలేకపోవడం కూడా పాక్ ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు. అయితే మ్యాచ్ మిస్ అయింది మాత్రం డిక్లరేషన్ టైమ్‌లోనే. రిజల్ట్ రాబట్టాలన్న తొందర, ఇంగ్లండ్ వాడే బజ్‌బాల్ లాంటి స్ట్రాటజీతో కొట్టేద్దామన్న ఊపుతో తాను తవ్విన గొయ్యిలో తానే పడింది పాక్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ మెరుగైన స్థితిలో ఉన్నప్పుడే డిక్లరేషన్ చేస్తుంది. ఈ ప్లాన్ ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంది. పాక్ విషయంలో అదే జరిగింది. మరి.. పాక్ ఓటమికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Bangladesh becomes the first team to beat Pakistan at home in a Test match by 10 wickets. 🚨 pic.twitter.com/kvXrHYx32A
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2024