IND vs BAN: బంగ్లాతో తొలి టెస్ట్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ, ఆ ముగ్గురిపై వేటు..

Team India Squad For Bangladesh First Test Match: బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు 16 మందితో కూడిన జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. ముగ్గురు ఆటగాళ్లపై వేటు పడగా.. లాంగ్ గ్యాప్ తర్వాత పంత్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

Team India Squad For Bangladesh First Test Match: బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు 16 మందితో కూడిన జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. ముగ్గురు ఆటగాళ్లపై వేటు పడగా.. లాంగ్ గ్యాప్ తర్వాత పంత్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్ ద్వారా తిరిగి టెస్ట్ ఫార్మాట్ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. 2022లో కారు ప్రమాదానికి గురైన తర్వాత పంత్ ఆడనున్న తొలి టెస్ట్ ఇదే కావడం విశేషం. పంత్ రాకతో ఓ యంగ్ ప్లేయర్ పై వేటు పడక తప్పలేదు. ఇక యూపీకి చెందిన స్టార్ బౌలర్ యశ్ దయాళ్ తొలిసారి టీమిండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు.

బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ లకు గాను తొలి టెస్ట్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ లాంగ్ గ్యాప్ ద్వారా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అనూహ్యంగా సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు షాక్ తగిలింది. పంత్ టీమ్ లోకి రావడంతో.. తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేెఎస్ భరత్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక ఇంగ్లండ్ సిరీస్ లో అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్ సెలక్టర్ల దృష్టిలో నుంచి వెళ్లకుండా.. టీమ్ లోకి ఎంపికైయ్యాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? సీనియర్ ప్లేయర్ కేఎస్ రాహుల్ కీపర్ గా కాకుండా బ్యాటర్ గా టీమ్ లోకి తీసుకున్నారు. అప్పటికే రిషబ్ పంత్, ధృవ్ జూరెల్ లు కీపర్లుగా ఎంపికైయ్యారు.

కాగా.. టీమిండియా ఫ్యూచర్ క్రికెటర్లుగా పేరొందిన దేవ్ దత్ పడిక్కల్, రజత్ పటిదార్ లకు మెుండిచేయి ఎదురైంది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో యూపీ యంగ్ పేసర్ యశ్ దయాళ్ కు జాతీయ జట్టులోకి పిలుపొచ్చింది. యశ్ దయాళ్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 76 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన ఆకాశ్ దీప్ కు కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన ఆకాశ్.. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు కొంత విశ్రాంతి అనంతరం బంగ్లాతో మ్యాచ్ కు రెడీ అవుతున్నారు. కాగా.. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు చిదంబరం స్టేడియం వేదికగా జరగనుంది.

బంగ్లాతో తొలి టెస్ట్ కు ఎంపికైన టీమిండియా జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్ మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జూరెల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్‌.

Show comments