Nidhan
Ricky Ponting Joins Punjab Kings As The New Head Coach: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌ను ఆ జట్టు రీసెంట్గా తీసేసింది. హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తొలగించి పంటర్‌ను ఇంటికి సాగనంపింది డీసీ.
Ricky Ponting Joins Punjab Kings As The New Head Coach: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌ను ఆ జట్టు రీసెంట్గా తీసేసింది. హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తొలగించి పంటర్‌ను ఇంటికి సాగనంపింది డీసీ.
Nidhan
ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. గత కొన్ని సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా సేవలు అందించాడు పంటర్. అయితే ఐపీఎల్-2025కు ముందు అతడ్ని ఆ పోస్ట్‌లో నుంచి తొలగించి ఇంటికి సాగనంపింది డీసీ. దీంతో పాంటింగ్ ఐపీఎల్ ఫ్యూచర్ సందిగ్ధంలో పడింది. ఈ కంగారూ దిగ్గజం మళ్లీ క్యాష్ రిచ్ లీగ్‌లో కనిపించడా? అని అభిమానులు ఆందోళన పడ్డారు. అతడి కోచింగ్ స్టైల్, అగ్రెసివ్ అప్రోచ్‌ను మిస్ అవుతామని బాధపడ్డారు. అయితే పాంటింగ్ షార్ట్ గ్యాప్‌లోనే ఐపీఎల్‌లోకి తిరిగొచ్చేశాడు. అతడ్ని ఓ టీమ్ నూతన హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. మరి.. పాంటింగ్‌ను కోచ్‌గా నియమించిన ఆ జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..
పంజాబ్ కింగ్స్ జట్టు పాంటింగ్‌ను తమ నూతన హెడ్ కోచ్‌గా నియమిస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. పంటర్ ఇప్పుడు పంజాబ్‌లోకి వచ్చేశాడంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రకటించిందా ఫ్రాంచైజీ. వచ్చే సీజన్ నుంచి అతడు బాధ్యతలు చేపడతాడని తెలిపింది. అతడితో నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని పంజాబ్ కింగ్స్ స్పష్టం చేసింది. ఐపీఎల్-2028 వరకు పాంటింగ్ తమ టీమ్‌కు కోచ్‌గా ఉంటాడని పేర్కొంది. పంజాబ్ జట్టుకు పాంటింగ్‌కు ముందు ఏడు సీజన్లలో కలిపి 5 మంది కోచ్‌లు పని చేశారు. ఆ టీమ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్న ఆరో కోచ్‌గా పంటర్ నిలవనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొన్ని సీజన్ల పాటు కోచ్‌గా సేవలు అందించాడీ ఈ కంగారూ లెజెండ్. రెండు నెలల కింద ఆ పోస్ట్ నుంచి డీసీ తీసేయగా.. ఇప్పుడు పంజాబ్ కోచింగ్ బృందంలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు.
పంజాబ్ కింగ్స్ నయా హెడ్ కోచ్‌గా వచ్చిన పాంటింగ్ ముందు భారీ టార్గెట్ ఉంది. ఎందుకంటే ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది లేదు. ఐపీఎల్-2014లో రన్నరప్‌గా నిలవడమే ఆ టీమ్ ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్. గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ పూర్తిగా నిరాశపర్చింది. ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచి తమ అభిమానుల్ని కంప్లీట్‌గా డిజప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌గా పంటర్ నుంచి భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటు ఫ్యాన్స్, ఇటు ఫ్రాంచైజీ అతడి మీద గంపెడాశలు పెట్టుకుంది. ట్రోఫీ సంగతి అటుంచితే టీమ్‌ను కనీసం ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లినా అదే పదివేలని భావిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌ను ఒక టీమ్‌లా సెట్ చేయగలిగితే చాలు అని ఆశిస్తున్నారు. గెలవగలమనే కసిని ఆటగాళ్లలో నింపి నడిపిస్తే బాగుంటుదని సూచిస్తున్నారు. మరి.. పాంటింగ్ పంజాబ్ కప్పు కలను తీరుస్తాడా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
𝐏𝐔𝐍TER is 𝐏𝐔𝐍JAB! 🦁♥️
🚨 Official Statement 🚨
Ricky Ponting joins Punjab Kings as the new Head Coach! #RickyPonting #SaddaPunjab #PunjabKings pic.twitter.com/DS9iAHDAu7— Punjab Kings (@PunjabKingsIPL) September 18, 2024