Andrew Flintoff: ఆ టీమ్​కు కోచ్​గా ఆండ్రూ ఫ్లింటాఫ్​.. ఇక క్రికెట్​లో వాళ్లదే పెత్తనం!

ఇంగ్లండ్ లెజెండ్ ఆండ్రూ ఫ్లింటాఫ్ నయా రోల్​లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది. ఆ టీమ్​కు కోచ్​గా వెళ్లేందుకు మాజీ ఆల్​రౌండర్ సమాయత్తం అవుతున్నాడట.

ఇంగ్లండ్ లెజెండ్ ఆండ్రూ ఫ్లింటాఫ్ నయా రోల్​లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది. ఆ టీమ్​కు కోచ్​గా వెళ్లేందుకు మాజీ ఆల్​రౌండర్ సమాయత్తం అవుతున్నాడట.

ఆండ్రూ ఫ్లింటాఫ్​.. 2000వ దశకంలో క్రికెట్​లో బాగా మార్మోగిన పేర్లలో ఒకటి. ఈ ఇంగ్లండ్ మాజీ ఆల్​రౌండర్ తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యాడు. భీకర పేస్, స్వింగ్​తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు ఫ్లింటాఫ్. బాల్​ను ఇరు వైపులా స్వింగ్ చేస్తూ అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టేవాడు. అదే సమయంలో అవసరమైనప్పుడు బ్యాట్​తోనూ చెలరేగేవాడు. ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​ రిజల్ట్​ను చూస్తుండగానే మార్చేసేవాడు. గాయాల కారణంగా కెరీర్​ను సుదీర్ఘ కాలం పొడిగించుకోలేకపోయాడు ఫ్లింటాఫ్. కానీ ఆడినంత కాలం ఇంగ్లండ్ జట్టుకు అంతా తానై నిలిచాడు. యాషెస్ సిరీస్ సహా ఎన్నో కీలక టోర్నమెంట్స్​లో అదరగొట్టాడు. అలాంటోడు రిటైర్మెంట్ తర్వాత క్రికెటింగ్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు.

క్రికెట్​లోకి మళ్లీ కమ్​బ్యాక్ ఇస్తున్న ఫ్లింటాఫ్​కు వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంగ్లండ్ పాపులర్ లీగ్ అయిన ది హండ్రెడ్​లో నార్తర్న్ సూపర్​ఛార్జర్స్​కు కోచ్​గా ఎంపికయ్యాడీ లెజెండ్. ఈ సీజన్​లో ఆ టీమ్​ను విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్సే సూపర్​ఛార్జర్స్ జట్టుకు సారథిగా ఉన్నాడు. దీంతో వీళ్లిద్దరి కలయికతో టీమ్ ఛాంపియన్​గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ది హండ్రెడ్ లీగ్​తో ఫ్లింటాఫ్​ బిజీగా ఉన్న ఈ తరుణంలో​ అతడ్ని ఇంగ్లండ్​ కోచ్​ పదవి ఎంపికకు పరిగణనలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ టీమ్ వైట్ బాల్ కోచ్​గా ఫ్లింటాఫ్​ పేరును ఇంగ్లీష్ బోర్డు ఖాయం చేసిందని బ్రిటీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇంగ్లండ్ వైట్ బాల్ కోచ్ మాథ్యూ మాట్​ను తీసేసి అతడి స్థానంలో ఫ్లింటాఫ్​ను రీప్లేస్ చేయాలని అ దేశ క్రికెట్ బోర్డు డిసైడ్ అయిందట. గత ఏడాదిన్నర కాలంలో చూసుకుంటే వైట్ బాల్ క్రికెట్​లో ఇంగ్లీష్ టీమ్ పెర్ఫార్మెన్స్ పడిపోయింది. వన్డే వరల్డ్ కప్-2023లో లీగ్ దశ దాటలేకపోయిన ఆ టీమ్.. టీ20 ప్రపంచ కప్​లో సెమీస్​ దగ్గరే ఆగిపోయింది. దీంతో కోచ్ మాట్​ను తొలగించాలని ఈసీబీ నిర్ణయించుకుందట. అతడి స్థానంలో ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్న ఫ్లింటాఫ్ కరెక్ట్ అని భావిస్తోందట. త్వరలో అతడి పేరును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్.. ఫ్లింటాఫ్ వస్తే ఇంగ్లండ్ మరింత దూకుడుగా ఆడటం పక్కా అని, ఆ టీమ్​ను ఆపలేమని అంటున్నారు. మరి.. ఫ్లింటాఫ్ కోచ్​గా రావాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

Show comments