Nidhan
All Weather Cricket Stadium: క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారడం చూస్తూనే ఉంటాం. వాన కారణంగా ఎన్నో మ్యాచ్‌లు రద్దయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ స్టేడియంలో మాత్రం ఈ సమస్య లేదు.
All Weather Cricket Stadium: క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారడం చూస్తూనే ఉంటాం. వాన కారణంగా ఎన్నో మ్యాచ్‌లు రద్దయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ స్టేడియంలో మాత్రం ఈ సమస్య లేదు.
Nidhan
క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారడం చూస్తూనే ఉంటాం. జెంటిల్మన్ గేమ్ అనే కాదు.. ఫుట్‌బాల్, హాకీ లాంటి పలు ఔట్‌డోర్ గేమ్స్‌కు వరుణుడు ఆటంకం కలిగించడం కామనే. అయితే వాన వల్ల ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు రద్దవుతుంటాయి. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో కొన్ని మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్‌లో రిజల్ట్ వస్తుంది. కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు, టెస్ట్ మ్యాచ్‌లు, డొమెస్టిక్ టోర్నమెంట్స్‌లో వరుణుడు మాత్రం మ్యాచ్‌లకు అడ్డుపడుతూనే ఉంటాడు. వాన అనే కాదు.. ఒక్కోసారి తీవ్రమైన ఎండ, భీకరమైన గాలుల వల్ల కూడా మ్యాచ్‌లు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ స్టేడియంలో మాత్రం ఈ సమస్య లేదు. వర్షం పడినా మ్యాచ్ ఆగకుండా కొత్త స్టేడియాన్ని రూపొందిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా.
ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో నయా స్టేడియం నిర్మాణానికి ఆ దేశ క్రికెట్ బోర్డు రూపకల్పన చేస్తోంది. సాధారణ స్టేడియాల్లాగే ఉన్నా దీని మీద పూర్తిగా గ్లాస్ రూఫ్ రానుంది. ఈ రూఫ్‌ను స్టీల్, టింబర్ మిశ్రమాల కలయికతో నిర్మిస్తారు. దీని వల్ల బయట వాన పడుతున్నా గ్రౌండ్లో మాత్రం ఒక్క చుక్క నీరు కూడా రాదు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా స్టేడియంలో మ్యాచ్‌లు కంటిన్యూ అవుతాయి. వాతావరణ ఇబ్బందులతో సంబంధం లేకుండా ఎంచక్కా ఆడుకోవచ్చు. అయితే బయట నుంచి ఎండ, సహజ కాంతి స్టేడియంలోకి పడేలా ఏర్పాట్లు చేస్తారు. 23 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియాన్ని 2028లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది.
క్రికెట్లో బ్యాటర్లు భారీ షాట్లు బాదుతుండటం తెలిసిందే. కొన్ని సిక్సులు అయితే ఏకంగా 110 మీటర్ల ఎత్తులో వెళ్లి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే టాస్మానియా స్టేడియం రూఫ్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని రూఫ్ ఎత్తును డిసైడ్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ ఆల్ వెదర్ క్రికెట్ స్టేడియం ఐడియాను ఆస్ట్రేలియాలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. స్టేడియం నిర్మిస్తున్న ప్రాంతం, దాని వల్ల పరిసర ప్రాంతాలపై పడే ప్రభావం మీద పలు విమర్శలు వస్తున్నాయి. అయినా క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని బలంగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరి.. ఎలాంటి వెదర్ కండీషన్లో అయినా మ్యాచ్‌లు జరిగేలా కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తుండటంపై మీ ఒపీనియన్‌ను కామెండ్ చేయండి.
The new stadium in Hobart could host indoor Test cricket. (Espncricinfo). pic.twitter.com/aV7sGLhKEb
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024