Abhishek Sharma Is First Indian Hit Century Wicket: అభిషేక్ శర్మ అరుదైన రికార్డు.. భారత క్రికెట్​లో ఒకే ఒక్కడు!

Abhishek Sharma: అభిషేక్ శర్మ అరుదైన రికార్డు.. భారత క్రికెట్​లో ఒకే ఒక్కడు!

Team India: టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. భారత క్రికెట్​లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానిది అతడు చేసి చూపించాడు.

Team India: టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. భారత క్రికెట్​లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానిది అతడు చేసి చూపించాడు.

వన్డేలు, టెస్టుల్లో సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. అయితే టీ20 క్రికెట్​లో మాత్రం ఇదంత ఈజీ కాదు. లీగ్స్​లో కొట్టొచ్చేమో గానీ ఇంటర్నేషనల్ క్రికెట్​లో పొట్టి ఫార్మాట్​లో నమోదైన శతకాలు మాత్రం తక్కువే. అలాంటిది ఆడిన మొదటి సిరీస్​లోనే మూడంకెల స్కోరును చేరుకున్నాడు టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 47 బంతుల్లోనే 100 పరుగుల మార్క్​ను చేరుకున్నాడు. అతడి ఇన్నింగ్స్​లో బౌండరీల కంటే సిక్సులే ఎక్కువ. 7 ఫోర్లు కొట్టిన అభిషేక్.. ఏకంగా 8 భారీ సిక్సులు బాదాడు.

ఆ మ్యాచ్​లో 212 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఓ రేంజ్​లో పోయించాడు అభిషేక్. ఈ సిరీస్​లో బ్యాట్​తోనే గాక బంతితోనూ అతడు ఆకట్టుకుంటున్నాడు. జింబాబ్వే సిరీస్​లో అభిషేక్ తన టాలెంట్ మొత్తాన్ని చూపిస్తున్నాడు. ఒకవైపు బ్యాటింగ్​లో బ్లాస్టింగ్ ఇన్నింగ్స్​లు ఆడుతూనే బౌలింగ్​, ఫీల్డింగ్​లోనూ తన మార్క్ పెర్ఫార్మెన్స్​తో ఆకట్టుకుంటున్నాడు. ఆ టీమ్​తో జరిగిన నాలుగో టీ20లో 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఈ వికెట్​తో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. లెజెండరీ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల కూడా కానిది.. అభిషేక్ సాధించి చూపించాడు.

ఒక టీ20 సిరీస్​లో సెంచరీ బాదడంతో పాటు వికెట్ కూడా తీసిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీమిండియా నుంచి మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఆ మ్యాచ్​లో వికెట్ తీసిన అభిషేక్​కు బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. జింబాబ్వే విసిరిన 152 పరుగుల టార్గెట్​ను భారత్ వికెట్ నష్టపోకుండా 15.2 ఓవర్లలోనే ఊదిపారేసింది. సిరీస్​లోని ఆఖరి టీ20లో మరోమారు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ రెచ్చిపోవాలని అభిషేక్ అనుకుంటున్నాడు. మరోసారి భారీ ఇన్నింగ్స్​తో మెరవాలని, వికెట్లతో చెలరేగాలని భావిస్తున్నాడు. మరి.. రోహిత్, కోహ్లీ వల్ల కూడా కాని ఫీట్​ను అభిషేక్ అందుకోవడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments