Yatra 2 Movie Review & Rating in Telugu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 నేడు విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
Yatra 2 Movie Review & Rating in Telugu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 నేడు విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
Raj Mohan Reddy
2019 ఎన్నికల ముందు రిలీజైన యాత్ర మూవీ.. రెండు రాష్ట్రాలను ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ తరువాత అదే మహి.వి.రాఘవ దర్శకత్వంలో యాత్ర-2 ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకి వచ్చిన యాత్ర-2 ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
వైఎస్సార్ రెండోసారి అధికారంలోకి రావడం.. రచ్చబండ కోసం వెళ్లి, తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడంతో యాత్ర మూవీ ముగిసింది. యాత్ర-2 కథ సరిగ్గా ఇక్కడ నుండే మొదలవుతుంది. వైఎస్సార్ మరణించిన తరువాత ఓదార్పు యాత్రకి ఎదురైన అడ్డంకులు, కేంద్రం అక్రమంగా పెట్టిన అవినీతి కేసులు, 2012లో వచ్చిన ఉపఎన్నికలు, బయటకి వచ్చాక జగన్ పార్టీని నిర్మించుకుంటూ వెళ్లిన విధానం, అబద్దపు హామీలు ఇవ్వలేక 2014లో తృటిలో చేజారిన విజయం, ఆ తరువాత కూడా జగన్ పైన కొనసాగిన కుట్రలు.. చివరగా ఇవన్నీ దాటుకుని వై.ఎస్ జగన్ 2019లో అఖండ విజయం సాధించిన తీరు.. ఇవన్నీ కలిపితేనే యాత్ర-2 కథ.
యాత్ర-2 కథ మనందరికీ తెలియనిది కావు. ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం ఈ జనరేషన్ సాక్షిగా జరిగిందే. కావాల్సినంత మీడియా కవరేజ్ కూడా దక్కింది. ఇలాంటి ఓపెన్ స్టోరీతో ఎమోషన్స్ పలికించాలంటే, సాధించిన విజయాల కన్నా, దాని వెనుకున్న జర్నీని హైలెట్ చేయడం అత్యవసరం. దర్శకుడు మహి.వి.రాఘవ ఈ పాయింట్ ని సరిగ్గా పట్టుకున్నాడు. జగన్ జర్నీని పూసగుచ్చినట్టు చూపిస్తూ, ఆ ప్రయాణంలో ఎదురైనా సవాళ్ళను ఎలా దాటాడు అన్న అంశాలపై ఎక్కువ ద్రుష్టి పెట్టాడు. ఇక్కడే యాత్ర-2 స్థాయి అమాంతం పెరిగిపోయింది. కథలోకి నేరుగా వెళ్లిపోకుండా.. వైఎస్సార్ తన కొడుకు జగన్ మోహన్ రెడ్డిని కడప ప్రజలకి పరిచయం చేసే సన్నివేశం దగ్గర నుండి కథ మొదలు పెట్టడంతో.. సినిమా ఆసాంతం వైఎస్సార్ అనే ఎమోషన్ క్యారీ అయ్యింది. ఇది యాత్ర-2 కి బిగ్గెస్ట్ అసెట్ అయ్యింది.
ఒక్కసారిగా తండ్రి చనిపోవడం, చుట్టూ ఢిల్లీ పెద్దల రాజకీయం, తన తండ్రి కోసం చనిపోయిన మనుషుల.. కుటుంబాలను ఓదార్చాల్సి రావడం, నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఇవన్నీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాయి. మధ్య మధ్యలో.. జగన్ కడపోడు సర్ అంటూ ఇచ్చిన ఎలివేషన్స్.. వైసీపీ అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాయి. ఇక ఢిల్లీ పెద్దల మాట వినకుండా జగన్ ఓదార్పు యాత్రని కంటిన్యూ చేయడం, ఆ ఆక్రోశం తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్ కలిసి జగన్ పై అవినీతి ముద్ర వేసి జైలుకి పంపించి అతన్ని నాశనం చేయాలని చూడటంతో యాత్ర-2 ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది.
ఫస్ట్ అంతా జగన్ రైజ్ అనుకుంటే.. సెకండ్ ఆఫ్ అంతా జగన్ రూల్ అనే చందాన యాత్ర-2 సాగింది. జైలు నుండి బయటకి వచ్చిన జగన్.. తన వారి కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది? పార్టీ నిర్మాణం కోసం ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళాడు? 2014లో అధికారం ఎలా చేజారింది? ఆ తరువాత.. ఎలాంటి పరిస్థితుల్లో “ప్రజా సంకల్ప యాత్ర” చేయాల్సి వచ్చింది. ఎలా 151 సీట్ల అఖండ విజయం సాధ్యమైంది అనే విషయాలపై దర్శకుడు ప్రత్యేక ద్రుష్టి పెట్టి, ఇదే సమయంలో జగన్ పాత్రని ఓ మాస్ హీరో స్థాయి ఎలివేషన్స్ తో అద్భుతంగా చూపించాడు. స్వతహాగా జగన్ జర్నీలో అంతటి తెగింపు ఉండటం యాత్ర-2కి కమర్షియల్ టచ్ తీసుకొచ్చి పెట్టింది. అయితే.., చివర్లో జగన్ సీఎం అయ్యాక ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాల గురించి కూడా కొన్ని సీన్స్ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.
వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటన ఏ రేంజ్ లో ఉందో యాత్ర లోనే చూశాము. కానీ.., “యాత్ర-2” సడెన్ సప్రైజ్ ఇచ్చింది మాత్రం హీరో జీవా. అతన నడక, నడత, మాట, కదలికలు, కవళికలు అన్నీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని అచ్చు గుద్దేశాయి. కథలో కొంత దూరం పోయాక ఇక మనకి స్క్రీన్ పై జగన్ తప్ప.. ఎక్కడా జీవా కనిపించడు అంటే.. అతని యాక్టింగ్ ఏ స్థాయిలో ఉందో, ఆ పాత్ర కోసం ఎంతటి హోమ్ వర్క్ చేశాడో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇక మిగిలిన నటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శుభలేఖ సుధాకర్ గురించి. కడప కాంగ్రెస్ లీడర్ సాయి ప్రతాప్ పాత్రలో నటించిన శుభలేక సుధాకర్ నటించాడు. ఈ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి.. జగన్ గురించి చెప్పే డైలాగ్స్ కి ధియేటర్స్ లో రీ సౌండ్ రావడం పక్కా. మిగిలిన నటీనటులు అంతా తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు.
యాత్ర-2 కి అతిపెద్ద అసెట్ బ్యాగ్రౌండ్ స్కోర్. ఈ విషయంలో సంతోష్ నారాయణ్ వర్క్ ని మెచ్చుకుని తీరాల్సిందే. మధి సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇక ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ అన్నీ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. దర్శకుడిగా మహి కెపాసిటీ ఇప్పటికే అందరికీ తెలిసినా.. తన సినిమా రిలీజైన ప్రతిసారి టెక్నీషియన్ గా మహీ.వి.రాఘవ మరికొంచెం మెరుస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒక రకంగా యాత్ర-2 మహీ కెరీర్ బెస్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు.
రేటింగ్: 3.5/5
చివరి మాట: యాత్ర-2.. తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు పడ్డ కష్టం