Sriranga Neethulu (2024) Movie Review & Rating in Telugu: యంగ్ హీరో సుహాస్, రుహానీశర్మ జంటగా ప్రవీణ్‌కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘శ్రీరంగనీతులు. నేడు ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం..
Sriranga Neethulu (2024) Movie Review & Rating in Telugu: యంగ్ హీరో సుహాస్, రుహానీశర్మ జంటగా ప్రవీణ్‌కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘శ్రీరంగనీతులు. నేడు ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం..
Arjun Suravaram
యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కంటెంట్ ఓరియెంటేడ్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఒక్కొక్క మెట్టు హీరోగా ఎక్కుతున్నాడు. ఇటీవలే రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా శ్రీరంగ నీతులు అనే చిత్రంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 11 గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించగా, రుహానీ శర్మ, కార్తిక్ రత్నం, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ సినిమాతో సుహాస్‌కి మరో హిట్ పడిందా? అనేది రివ్యూలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సినిమా ప్రధానంగా మూడు స్టోరీల చుట్టూ తిరుగుతుంది. ఆంథాలజీ మూవీ అని చెప్పొచ్చు. శివ(సుహాస్)టీవీ కంపెనీలు ఉద్యోగం చేస్తుంటారు. స్థానిక ఎమ్మెల్యేతో ఫోటో దిగి.. ఆ ఫ్లెక్సీ కట్టించుకుని దాన్ని ఊర్లో ఉన్న గ్రౌండ్ లో పెట్టి తన రేంజ్ ని చూపించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ప్లెక్సీ కోసం తన స్నేహితుడు (రాగ్ మయూర్)తో కలిసి అనేక ఇబ్బందులు పడతాడు. అన్నిటిని దాటి ఆ ఫ్లెక్స్ కట్టాక ఎవరో దాన్ని దొంగిలిస్తారు. అది ఎవరు చేశారని కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. ఇదే సమయంలో మరో ప్లెక్సీ కట్టి తన పరువును నిలబెట్టుకోవాలనుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు, ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్ని సమస్యలు ఏం జరిగింది?
ఇక రెండో స్టోరీలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్)లవర్స్. ఇందు తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. అంతలోనే ఇంట్లో వాళ్ళు ఆమెకు ఓ పెళ్లి సంబంధం పిక్స్ చేస్తారు. అదే సమయంలో ఇందుకు తను ప్రగ్నెంట్ అని అనుమానం వస్తుంది. ఇంట్లో చెప్పలేక, లేచిపోయి పెళ్లి చేసుకోలేక వరుణ్ , ఇందు మధ్య ఓ ఘర్షణ జరుగుతోంది. చివరికి ఏమైంది? అంటే సినిమా చూడాల్సిందే.
ఇక మూడో కథ విషయానికి వస్తే.. కార్తిక్(కార్తీక్ రత్నం) కెరీర్ అనుకున్న విధంగా లేకపోవడంతో మద్యం, గంజాయికి బానిసవుతాడు. ఏకంగా ఇంట్లో గంజాయి మొక్కలు కూడా పెంచుకుంటాడు. ఆ విషయం పోలీసులకు తెలిసి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే, అతడు పారిపోతుంటాడు. పోలీసులకు దొరకుండా తన స్నేహితుడి హాస్టల్ లో ఉంటాడు. కార్తీక్ తండ్రి ద్వారా కార్తీకి ను పట్టుకునేందుకు పోలీసులు హాస్టల్ కి వెళ్తారు. ఇదే సమయంలో మరోసారి కార్తీక్ పారిపోయాడు. దీంతో తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొడుకు వస్తాడని, మారుతాడని తండ్రి పోలీస్ స్టేషన్లోనే ఎదురు చూస్తుంటాడు. మరి కార్తీక్ వచ్చాడా? అతను మారాడా? ఈ మూడు కథల్లో చివరికి ముగింపు ఏంటి?. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడనేది మిగిలిన కథ.
చిన్న కథలతో మూవీలు చేసి మెప్పిస్తున్నారు నేటితరం యువ డైరెక్టర్లు. చాలా వరకు సినిమాను కామెడీ జానర్ లో తీసుకెళ్తూ..చివరకు చిన్న సందేశం ఇస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. `శ్రీరంగ నీతులు` సినిమా కాన్సెప్ట్ కూడా అదే. ముగ్గురి జీవితాలను చూపిస్తూ, ఆ వ్యక్తులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, వారికి ఏం జరుగుతుంది? ఎందుకు అలా చేస్తున్నారు? చివరికి ఎలా మారుతున్నారనేది ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. నేటి తరాన్ని ఉద్దేశించి డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేటికాలం యువత సరైన గైడెన్స్ లేకపోవడం, గుడ్, బ్యాడ్ అంశాల గురించి చెప్పే వాళ్లు లేకపోవడం, అలానే వివిధ కారణాలతో యువత ఎలాంటి తప్పుడు మార్గంలో వెళ్తున్నారనేది ఈ మూవీ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.
సుహాస్ ఇప్పటికే తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు. ఈ సినిమాలో చాలా బాగా నటించి మెప్పించాడు. ఓ బస్తి కుర్రాడి పాత్రలో సుహాస్ నటించి మెప్పించాడు. అలానే విరాజ్ భయపడే ప్రియురాలి స్నేహితుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఇక రుహానీ శర్మ ఓ సాధారణ యువతి లా అందరిని మెప్పించింది. తనికెళ్ల భరణి, కార్తీక్ రత్నం, దేవీ ప్రసాద్, హర్షవర్ధన్, జీవన్, రాజ్ మయూర్ మిగిలిన నటీ నటులు కూడా వారి వారి పాత్రలతో మెప్పించారు.
ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ కి సూట్ అయ్యేలా బాగా కుదిరింది. పాటలు కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సినిమాటో గ్రఫీ, విజువల్స్ కూడా ఈ మూడు కథల్లో.. ఏ కథకు తగ్గట్టు అలానే చక్కగా కుదిరాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయనే చెప్పొచ్చు. మూడు కథలతో ఈ సినిమా సాగినప్పటికీ ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ప్రేక్షకులను చూపించడంలో డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సెస్ అయ్యాడు.
చివరి మాట: ‘శ్రీరంగనీతులు’ సినిమాలో జీవితం గురించి, జీవితంలో ఎలా ఉండాలి అని మూడు కథలతో చక్కగా చూపించారు.
రేటింగ్: 2.25/5