Aditya N
మలయాళంలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న "ప్రేమలు" మూవీ .. ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అయ్యి .. హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
మలయాళంలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న "ప్రేమలు" మూవీ .. ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అయ్యి .. హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Aditya N
గత నెలలో మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమలు సినిమా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుని నెల తరువాత తెలుగులోకి డబ్ చేయబడింది. ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ భాధ్యతలను తీసుకున్నారు. మరి ఈ మలయాళ సినిమా తెలుగు వర్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సచిన్, కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే తన ప్రపోజల్ ని ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడంతో బాధపడతాడు. యు.కె.కు మకాం మార్చాలని అనుకున్నా… వీసా అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవటంతో సచిన్ సహాయం కోసం తన స్నేహితుడు అమూల్ డేవిస్ ను ఆశ్రయిస్తాడు. హైదరాబాద్ లో గేట్ కోచింగ్ కు సిద్ధమవుతున్న అమూల్ డేవిస్ సచిన్ ను వెంట తీసుకువెళతాడు. అక్కడ ఓ పెళ్లిలో రీను అనే అమ్మాయిని కలిసిన సచిన్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఇక సచిన్, రీనుతో ఎలా స్నేహం పెంచుకున్నాడు? వారి రిలేషన్ షిప్ ఎలా ముందుకు సాగింది? అనేది మిగతా కథ.
కథగా చూస్తే ప్రేమలు చాలా సింపుల్ స్టోరీ అని చెప్పవచ్చు. కేరళకు చెందిన ఒక అమ్మాయి అబ్బాయి హైదరాబాద్ వచ్చి ప్రేమలో పడటం అనే పాయింట్ మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. దర్శకుడు గిరీష్ ఏడీ సినిమా వీలైనంత సహజంగా ఉండేలా చూసుకున్నారు. అలాగే దాదాపు ప్రతి సన్నీవేశంలో కామెడీ పండేలా చూసుకోవడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్న తేడా లేకుండా స్క్రీన్ ప్లే ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంది. సచిన్ – అమూల్ లు కలిసి పండించే ఎంటర్టైన్మెంట్ తో పాటు సచిన్ రీనుల మధ్య లవ్ ఫీల్ కూడా బాగా వచ్చింది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో దర్శకులు తెలిసో తెలియకో అమ్మాయిలను నిందించడం లాంటివి చేస్తుంటారు. అయితే గిరీష్ అటువంటి ప్రయత్నాలేమీ చేయకుండా ప్రేమకథలో ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే ఒక సందర్భంలో హీరో – హీరోయిన్ మధ్య గొడవ వచ్చినా మనం ఎవరి సైడ్ తీసుకోకుండా ఇద్దరి గురించి బాధపడతాం. ఇక దర్శకుడిని మెచ్చుకోవాల్సిన విషయం సినిమాలో హైదారాబాద్ నగరాన్ని ఒక బ్యాక్ డ్రాప్ లాగా కాకుండా క్యారెక్టర్ లాగా ఉపయోగించడమే. ఐటీ కారిడార్, ప్రసాద్స్ ఇమాక్స్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ వంటి ఏరియాలని సిట్యుయేషన్ కి అనుగుణంగా చూపించి ఆకట్టుకున్నారు.
సచిన్‌గా నస్లెన్ కె గఫూర్ అద్భుతంగా నటించారు. అమాయకత్వం చూపించే సీన్స్ తో పాటు కామెడీలో కూడా రాణించారు. ఇక సంగీత్ ప్రతాప్ సచిన్ స్నేహితుడు అమూల్‌గా భలే నవ్వించాతు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు బాగా సహాయపడింది. రీనుగా మమితా బైజు నటన కూడా ఆకట్టుకుంది.. అందమైన నవ్వుతో పాటు చక్కని హావభావాలతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. ఆదిగా శ్యామ్ మోహన్ కూడా బాగా నవ్వించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలలో బాగా నటించారు.
ప్రేమలు సినిమాలోని సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా సహాయపడింది. అజ్మల్ సాబు కెమెరా పనితనం కలర్‌ఫుల్‌గా ఉంది, ముఖ్యంగా హైదరాబాద్‌ను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.