యంగ్ హీరో శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’తో మరోమారు ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
యంగ్ హీరో శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’తో మరోమారు ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోవాలని అందరూ అనుకుంటారు. కానీ శ్రీవిష్ణు మాత్రం అలా కాదు. ఒక్కో చిత్రంతో ఆడియెన్స్ మనసుకు చేరువ అవ్వాలని చూస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చే మూవీస్‌తో వాళ్ల ఇంట్లోని వ్యక్తిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కామెడీతో గిలిగింతలు పెడుతున్నారు. ఒక్కోసారి సెంటిమెంట్ పాత్రల్లో కనిపిస్తూ వాళ్లను ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు. గతేడాది వచ్చిన ‘సామజవరగమన’తో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. మరోమారు కామెడీ ఎంటర్టైనర్తో ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఆయన నటించిన ‘ఓం భీం భుష్’ తాజాగా రిలీజైంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కృష్ణకాంత్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్లు కష్టపడకుండానే లైఫ్‌లో కింగ్‌లా బతకాలని అనుకునే బ్యాచ్. లెగసీ యూనివర్సిటీలో వీళ్లు చదువుకుంటారు. అక్కడి ప్రొఫెసర్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) దగ్గర పీహెచ్డీ చేయాలని అనుకుంటారు. అయితే ఈ ముగ్గురూ చేసే అల్లరి పనులు నచ్చక మధ్యలోనే వాళ్లను తరిమేస్తాడు ప్రొఫెసర్. దీంతో వినయ్ గుమ్మడి గ్రామం భైరవకొండకు వెళ్తూ అక్కడ పాడుపడిన ఓ బంగ్లాలో క్షుద్ర శక్తులు చేసే బైరాగి (షాన్ కక్కర్)ను చూస్తారు. అనంతరం సంపంగి అనే దెయ్యం ఉండే బంగ్లాలో నుంచి నిధులు తీసుకురావాలని సర్పంచ్, భైరాగులు ఛాలెంజ్ విసురుతారు. బంగ్లాలోకి వెళ్లిన ఆ ఫ్రెండ్స్‌కు సంపంగి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? స్నేహితులు అంతా కలసి సంపంగిని శాంతింపజేశారా? సర్పంచ్ విసిరిన సవాల్ గెలిచి జలజ (ప్రీతి ముకుందన్)ను మ్యారేజ్ చేసుకున్నాడా? అనే క్వశ్చన్స్కు ఆన్సర్సే ఈ సినిమా.
యూనివర్సిటీ ప్రొఫెసర్ తనను బాగా ఇబ్బంది పెట్టిన ముగ్గురు ఫ్రెండ్స్ గురించి చెప్పడంతో స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీన్ నుంచే హిలేరియల్ ఫన్ ఉంటుంది. ఎపిసోడ్స్‌గా డైరెక్టర్ రాసుకున్న సీన్స్ వేటికి అవే సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యాయి. మొదటి సీన్ నుంచి ఫన్ ఎలిమెంట్స్‌తో పట్టాలెక్కిన ఫిల్మ్.. ఆ తర్వాత కామెడీ ట్రాక్‌తో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంది. దర్శకుడు రాసుకున్న ఎపిసోడ్స్‌లో రెండు, మూడు మాత్రం ప్రేక్షకుల్ని సీట్ల మీద నుంచి లేచి నవ్వేలా చేస్తాయి. లాజిక్, అర్థం లేకపోయినా డైలాగ్స్ తెగ నవ్విస్తాయి. ఫన్ రైడ్‌తో ఫస్టాఫ్‌ను ముగించిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ప్యారలల్‌గా ఎమోషనల్ ట్రాక్‌ను కూడా నడిపిస్తూ ఆడియెన్స్ మనసులను దోచుకున్నారు. చివర్లో పార్ట్ 2కు లీడ్ ఇచ్చి ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేశారు.
‘ఓం భీం బుష్’కు అతిపెద్ద బలం శ్రీవిష్ణునే. ప్రతి సినిమాతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఆయన. ఈ మూవీలో సర్ప్రైజింగ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. హ్యూమర్‌ను పండించడంతో పాటు పాటు నటనకు అవకాశం దొరికిన ప్రతి చోట చెలరేగిపోయారు. తాను కంప్లీట్ యాక్టర్‌ను అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శికి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టినపిండి. వాళ్లు కూడా పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. రచ్చ రవి కూడా నవ్వులు పూయించారు.
ఈ సినిమాకు సంబంధించి టెక్నికల్ టీమ్ 100 పర్సెంట్ పర్ఫెక్షన్ చూపించారు. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్‌గా నిలిచింది. ఆర్డ్ డైరెక్టర్ శ్రీకాంత్ చిత్రం కోసం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. సన్నీ తన అద్భుతమైన మ్యూజిక్‌తో సినిమాలోని చాలా సీన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఫన్, హ్యూమర్, ఎమోషన్స్‌తో పకడ్బందీగా స్క్రిప్ట్‌ను రాసుకొని అంతే బాగా సినిమాను తీసిన దర్శకుడు హర్ష మంచి మార్కులు కొట్టేశారు.
(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)