Swetha
గత నెల రోజుల నుంచి మంచు విష్ణు ఎడతెరపి లేకుండా ప్రమోషన్స్ , ఇంటర్వూస్ ఇస్తూనే ఉన్నారు. సినిమాను జనాల్లోకి ఎంత వరకు తీసుకుని వెళ్లగలడో అంతా చేశారు విష్ణు. ఫైనల్ గా సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మంచు విష్ణు అనుకున్నది సాదించాడా లేదా? మంచు వారి సినిమాకు మంచి మార్కులు పడ్డాయా లేదా ? అనేది రివ్యూలో చూసేద్దాం.
గత నెల రోజుల నుంచి మంచు విష్ణు ఎడతెరపి లేకుండా ప్రమోషన్స్ , ఇంటర్వూస్ ఇస్తూనే ఉన్నారు. సినిమాను జనాల్లోకి ఎంత వరకు తీసుకుని వెళ్లగలడో అంతా చేశారు విష్ణు. ఫైనల్ గా సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మంచు విష్ణు అనుకున్నది సాదించాడా లేదా? మంచు వారి సినిమాకు మంచి మార్కులు పడ్డాయా లేదా ? అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ కలలు కంటున్న మూవీ ఫైనల్ గా రిలీజ్ అయింది. ఈరోజు కోసం మంచు ఫ్యామిలీతో పాటు ఆడియన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేశారు. పైగా గత నెల రోజుల నుంచి మంచు విష్ణు ఎడతెరపి లేకుండా ప్రమోషన్స్ , ఇంటర్వూస్ ఇస్తూనే ఉన్నారు. సినిమాను జనాల్లోకి ఎంత వరకు తీసుకుని వెళ్లగలడో అంతా చేశారు విష్ణు. ఫైనల్ గా సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మంచు విష్ణు అనుకున్నది సాదించాడా లేదా? మంచు వారి సినిమాకు మంచి మార్కులు పడ్డాయా లేదా ? అనేది రివ్యూలో చూసేద్దాం.
కన్నప్ప కథ :
స్వర్ణ ముఖి నది ఒడ్డున ఉన్న ఓ అడవి ప్రాంతంలో ఐదు తెగల వారు నివసిస్తూ ఉండేవారు. అందులో ఓ తెగకు నాయకుడు నాధనాధుడు(శరత్ కుమార్).. అతని కుమారుడు తిన్నడు(మంచు విష్ణు). అతనికి చిన్నతనం నుంచే దేవుడంటే భక్తి లేదు.. ఇష్టం లేదు. దేవుళ్లను పూజించే వారిని కూడా ఇతను దూషిస్తూ ఉండేవాడు. తిన్నడు యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత అతను మరో తెగకు చెందిన నెమలి( ప్రీతి ముకుందన్) అనే ఆమెను ఇష్టపడతాడు. మరో వైపు ప్రశాంతంగా ఉంటున్న ఆ అడవి మీద.. ఆ ఐదు గూడాల మీద.. అక్కడ ఉన్న వాయులింగం మీద కాలాముఖుడు అనే ఓ దుర్మార్గుడి కన్నుపడుతుంది. ఈ క్రమంలో తిన్నడు ఆ కాలాముఖుడి తమ్ముడిని చంపేస్తాడు. దీనితో తిన్నడుతో సహా 5 గూడాలకు చెందిన ఆటవిక జనాన్ని చంపేందుకు కాలాముఖుడు వేలాదిమంది సైన్యంతో వస్తాడు. అప్పుడు ఆ ఐదు గుడాల నాయకులు కలిసి అతని మీద పోరాడాలని నిర్ణయించుకుంటారు. దానికి తిన్నడుని తమ నాయకుడిగా ఎంచుకుంటారు. కానీ అనుకోకుండా తిన్నడు తండ్రి అతనిని గూడెం నుంచి వెలివేస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది ?అసలు నాధనాధుడు తిన్నడుని ఎందుకు వెలివేశాడు? నెమలి, తిన్నడు ఒకటయ్యారా? ఇందులో రుద్ర( ప్రభాస్), కిరాత(మోహన్ లాల్) ,మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు)ల పాత్రలేమిటి ? నాస్తికుడైన తిన్నడు మహా శివభక్తుడిగా ఎలా మారాడు ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.
నటినటుల పని తీరు :
సినిమాలో ఎలాంటి తారాగణం ఉన్నారో అందరికి తెలిసిందే. ఇంతమంది గొప్ప నటీనటులు ఉన్నారు కాబట్టి. ప్రతి పాత్ర కీలకమే. మూవీలో ఎవరెవరు ఎంతసేపు చేశారు అనేది పక్కన పెట్టేస్తే.. ఎవరి క్యారెక్టర్ ఎంత బలంగా ఉంది అనేది ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులపై బలమైన ఇంపాక్ట్ చూపించింది. అక్షయ్ కుమార్ , మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్ , ప్రీతి ముకుందన్ , ముఖేష్ రిషి, కాజల్ లాంటి వారంతా అతిధి పాత్రల్లా కాసేపే కనిపించినా సినిమాకు వారు బిగ్ అసెట్స్ గా నిలిచారు. ఇక సినిమాకు అసలు హైప్ తీసుకొచ్చిన డార్లింగ్ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుంది. ప్రభాస్ క్యరెక్టర్ డిజైన్ చేసిన తీరు.. కథలో వాడుకున్న తీరుకు ప్రేక్షకులు శాటిస్ఫై అవుతారు. ఆ తర్వాత అసలు హీరో మంచు విష్ణు.. అయితే కన్నప్ప పాత్రలో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ లో కన్నీళ్లు తెప్పించే విధంగా నటించాడు విష్ణు. ఇక మిగిలిన వారంతా కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పి తీరాలి.
టెక్నీకల్ విభాగం పని తీరు :
ఒక దర్శకుడిగా కథకు , కథలోని పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేసాడు ముఖేష్ కుమార్ సింగ్. సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ రూపొందించిన విజువల్స్ కూడా అదిరిపోతాయి. ఇక సినిమాలో అత్యంత బలంగా కనిపించే అంశాలలో ఒకటి మ్యూజిక్. కథకు తగినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతోంది. కొన్ని చోట్ల పక్కా గూస్బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అయితే ఎడిటింగ్ , గ్రాఫిక్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బావుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా కుదిరాయి. భక్తి ప్రధానమైన సినిమా అయినా సరే ఎక్కడ మరి లోతైన మాటలు కాకుండా ఇప్పటి జనరేషన్ కు కూడా అర్ధమయ్యే విధంగా ఉంటాయి. కాకపోతే సినిమా నిడివి విషయంలో కాస్త జాగ్రత్త పడిఉండాల్సింది అనే ఫీలింగ్ కలుగుతుంది.
విశ్లేషణ :
విష్ణు అనుకున్నది అనుకున్నట్లు సాధించాడని చెప్పొచ్చు. భక్త కన్నప్ప గురించి అందరికి తెలిసిందే. ఇదివరకే ఎన్నో సినిమాలు వచ్చి సక్సెస్ అందుకున్నాయి. కానీ విష్ణు నేటి తరానికి అర్ధమయ్యే విధంగా ఈ సినిమాను కమర్షియల్ హంగులతో రూపొందించాలని అనుకున్నాడు. దానినే చేసి చూపించాడు. కథ ఓపెనింగ్ లో అన్ని పాత్రలను పరిచయం చేస్తూ.. క్రమంగా తిన్నడు నాస్తికుడి నుంచి మహా భక్తుడిగా ఎలా మారాడు అని ఎస్టాబ్లిష్ చేస్తూ చూపించిన తీరు బాగుంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇలా క్యారెక్టర్స్ ను పరిచయం చేయడంతోనే సాగిపోతూ ఉంటుంది. అసలు కథ అంతా కూడా సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది.
సెకండ్ ఆఫ్ లోనే తిన్నడు భక్త కన్నప్పగా మారతాడు. మొదటి హాఫ్ చూస్తున్నప్పుడు కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ ఆఫ్ స్టార్ట్ అవుతుందో ఇక కథ ఊపందుకుంటుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఇక ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనం అయిపోతారు. ప్రభాస్‌కీ విష్ణుకీ మధ్య సంభాషణలు చాలా బాగుంటాయి. ప్రభాస్ ప్రశాంతంగా కనిపిస్తూనే రుద్ర పాత్రతో కట్టిపడేస్తాడు. ముఖ్యంగా ఆఖరి 40 నిముషాలు ప్రేక్షకులు రెప్పార్పకుండా చూసేలా ఉంటుంది. సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి రిలీజ్ ముందు వరకు కూడా ఎక్కడో కొంత ట్రోలింగ్ నడిచిన మాట నిజమే. కానీ ఒక్కసారి సినిమా చూస్తే మాత్రం ఓ మంచి సినిమా చూశామనే శాటిస్ఫాక్షన్ తో ప్రేక్షకులు బయటకు వస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి కన్నప్ప అన్నమ్మయ్య , రామదాసు లాంటి ఓ వైబ్ ను అయితే ఇస్తుందని చెప్పొచ్చు.
ప్లస్ లు :
మైనస్ లు :
రేటింగ్ : 3/5
చివరిగా : ఎంగేజింగ్ ఎలిమెంట్స్ తో నేటితరాన్ని కూడా మెప్పించే డివోషనల్ సినిమా ‘కన్నప్ప’